Home » తమ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్స్ వీళ్ళే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!

తమ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్స్ వీళ్ళే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!

by Srilakshmi Bharathi
Ad

బాక్సాఫీస్ వద్ద ఇంతవరకు ఫ్లాప్‌ని అందించని దర్శకులు మొత్తం సినిమా ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతిసారీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలంటే అద్భుతమైన ప్రతిభ మరియు అదృష్టం ఉండాలి. కొంతమంది డైరెక్టర్స్ కు అది సొంతం. ఈ రోజు వరకు తమ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్ అందించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఆర్టికల్ లో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ను ఎదుర్కోని కొంతమంది డైరెక్టర్స్ గురించి తెలుసుకుందాం.

1. రాజమౌళి:

Advertisement

rajamouli 1
బ్లాక్ బస్టర్ హిట్ అనేది రాజమౌళికి పర్యాయపదంగా మారింది. ఆయన తీసిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్లే. ఇప్పటివరకు ఆయన ఒక్క ఫ్లాప్ ని కూడా చూడలేదు.

2. లోకేష్ కనగరాజ్:


ఈయన తమిళ దర్శకుడు. 2017లో రిలీజ్ అయిన మానగరం సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మాస్టర్, విక్రమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కెరీర్ లో ఫ్లాప్ ని చూడలేదు.

3. అనిల్ రావిపూడి:


ఆయన ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసాడు మరియు అతని ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద డబ్బు సంపాదించింది. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత ఈ తరంలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఏకైక దర్శకుడు అనిల్.

4. ప్రశాంత్ నీల్:

Advertisement

ఉగ్రం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ తరువాత కెజిఎఫ్ తీశారు. ఈ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

5. సందీప్ రెడ్డి వంగా:


ఈయన ఒకే స్టోరీని రెండు భాషలలో తీసి సక్సెస్ అయ్యారు. అదే తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీ లో కబీర్ సింగ్. మరోసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి ఆయన “యానిమల్” సినిమాతో వస్తున్నారు.

6. అట్లీ:


ఈయన కూడా తమిళ్ దర్శకుడు. ఈయన అసలు పేరు అరుణ్ కుమార్. కానీ అందరికి అట్లీ గా పరిచయం అయ్యారు. శంకర్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన అట్లీ రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ సినిమా తరువాత, తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ సినిమాలు తీశారు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

7. మారి సెల్వరాజ్:


ఈయన ఇప్పటివరకు చేసిన సినిమాలు తక్కువే. పరియేరుమ్ పెరుమాళ్క, కర్ణన్, మామన్నన్ , ధృవ్ విక్రమ్ 4 సినిమాలకు దర్శకుడిగా పనిచేసారు. అయితే అన్ని సూపర్ హిట్లే.

మరిన్ని..

Chiranjeevi : ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన సురేఖ..కానీ చివరికి..?

వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌.. యుజ్వేంద్ర చాహల్‌ కీలక నిర్ణయం!

MS Dhoni : ఇదేం క్రేజ్ బ్రో.. ఏకంగా ట్రంప్ తోనే ధోని ఆటలు

Visitors Are Also Reading