Home » వివి వినాయక్ ని మొదటి సారి చూసినప్పుడు ఎన్టీఆర్ ఏమనుకున్నారో తెలుసా ? కాని చివరికి ఏమయ్యిందంటే

వివి వినాయక్ ని మొదటి సారి చూసినప్పుడు ఎన్టీఆర్ ఏమనుకున్నారో తెలుసా ? కాని చివరికి ఏమయ్యిందంటే

by Anji
Ad

సాధారణంగా సినీ రంగంలో అనుకోకుండా చాలా జరుగుతుంటాయి. కొన్ని సక్సెస్ ఇస్తే.. మరికొన్ని ఫ్లాప్ ల్లోకి నెడుతుంటాయి. అలా అనుకోకుండా కుదిరిన కొన్ని సినిమాలు రికార్డు సృష్టించిన సందర్భాలు చాలానే జరిగాయి. అలాంటి వాటిలో ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఆది. స్టూడెంట్ నెం.1 మూవీకి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం యూనిట్ స్విట్జర్లాండ్ కి వెళ్లింది. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియాకి బయలు దేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు.

Advertisement

అందులో ఒకరు నన్ను గుర్తు పట్టారా.. నా పేరు బుజ్జి.. నిన్ను చూడాలని సినిమా మార్నిగ్ షో చూసి గుంటూరు నుంచి మీకు ఫోన్ చేశాను అని గుర్తు చేశాడు. ఆ తరువాత పక్కనే ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ.. ఇతని పేరు వి.వి.వినాయక్.. సాగర్ గారి దగ్గర అసిసోయేట్ గా చేశారు. ప్రస్తుతం చంద్రమహేష్ దర్శకత్వంలో వస్తున్న చెప్పాలని ఉంది సినిమాకి పని చేస్తున్నాడు. పాటల కోసం ఇక్కడికి వచ్చాం. మీకు కరెక్ట్ గా సరిపోయే కథ ఒకటి మాదగ్గర ఉంది. వింటారా అని అడిగాడు బుజ్జి. హైదరాబాద్ వచ్చిన తరువాత కలవమని చెప్పాడు ఎన్టీఆర్. చెప్పినట్టుగానే ఎన్టీఆర్ ని కలిశారు బుజ్జి, వినాయక్. చూడటానికి రౌడీలా ఉన్నాడు.. ఇతను సినిమా తీయగలడా అనుకున్నాడట ఎన్టీఆర్. వినాయక్ మాత్రం కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. కథ మొత్తం చెప్పనవసరం లేదు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ క్లైమాక్స్ చెబితే చాలు అన్నాడు ఎన్టీఆర్.

Advertisement

 

వినాయక్ ఇంట్రో ఒక్కటే చెబుతాను. మీకు నచ్చితే మిగతా కథ వినండి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. రెండు గంటల పాటు కథ విన్న తరువాత ఈ సినిమాని చేస్తున్నాం అన్నాడు ఎన్టీఆర్. వినాయక్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయిపోయింది. నాలుగు రోజుల తరువాత ఎన్టీఆర్ నుంచి వినాయక్ కి కబురు వచ్చింది. వినాయక్ వెళ్లి ఎన్టీఆర్ ని కలిశాడు. కథ బాగానే ఉంది. కానీ లవ్ స్టోరీ చేయద్దంటున్నాడు కొడాలి నాని. మంచి మాస్ కథ ఏదైనా ఉంటే చేయమన్నాడు. అలాంటి కథ ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు ఎన్టీఆర్. అప్పటికప్పుడు మాస్ కథ అంటే ఎలా వస్తుంది అనుకుంటూ ఉన్న వినాయక్ కి తను ఎప్పుడో అనుకున్న రెండు సీన్లు గుర్తుకొచ్చాయి. అవే చెప్పాడు వినాయక్.

 

ఒక చిన్న పిల్లాడు బాంబులు వేయడం.. బ్లాస్ట్ ల్లో సుమోలు గాల్లోకి లేవడం.. ఈ రెండు చెప్పాక ఫ్యాక్షన్ కథ నాకు హెవీ అయిపోతుందేమో అన్నాడు. ఎలాగైనా తనను వదిలించుకోవాలని అలా చెబుతున్నాడని వినాయక్ కి అర్థం అయింది. ఒకవారం సమయం ఇవ్వండి.. కథ రెడీ చేస్తాను. అది కూడా నచ్చకపోతే డేట్స్ ఎవ్వరికైనా ఇచ్చేయండి అని చెప్పాడు వినాయక్. తిండి, నిద్ర మీద ధ్యాస పెట్టకుండా ప్రతిక్షణం స్క్రిప్ట్ రెడీ చేసేందుకు ఉపయోగించాడు. 58 పేజీల స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. కథ విన్న ఎన్టీఆర్ ఎగిరి గంతేశాడు. సినిమా చేయడానికి ఓ కండిషన్ పెట్టాడు ఎన్టీఆర్. బూరగపల్లి శివరామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తారు అని చెప్పారు. దానికి వినాయక్ అభ్యంతరం చెబుతూ బుజ్జి ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాను. నేను అతడికి మాట ఇచ్చానన్నాడు. వినాయక్ మాటకు కట్టుబడే గుణం ఎన్టీఆర్ కి నచ్చి బుజ్జితోనే సినిమా చేశారు. అలా ఆది సినిమా ప్రారంభమైంది. మార్చి 28, 2002లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో 19 ఏళ్ల వయస్సులోనే స్టార్ హీరో అయ్యాడు ఎన్టీఆర్. వి.వి. వినాయక్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అప్పట్లో ఈ సినిమా రూ.25కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనమే సృష్టించింది. 

Also Read :  రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంటతడి పెట్టిన శ్రీదేవి.. ఎందుకంటే..?

Visitors Are Also Reading