ఇటీవల కాలంలో వచ్చి బాక్సాఫీసును దున్నేసిన సినిమాల లిస్ట్ లో కేజిఎఫ్ సినిమా కూడా ఒకటి. ఒకప్పుడు కన్నడ సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండకపోయేది. కన్నడలో స్టార్ హీరోలుగా చెప్పుకునే హీరోలు ఇతర భాషల్లో విలన్ పాత్రలు సైతం చేసేవారు. దాంతో కన్నడ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉండేది. కానీ కేజీఎఫ్ సినిమా దెబ్బతో అన్ని మారిపోయాయి. కన్నడ సినిమాలకు ఇండియా లెవెల్ లో మార్కెట్ ఏర్పడింది.
read also : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్
Advertisement
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే, కేజిఎఫ్ సినిమాపై ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా విమర్శలు చేశారు. ‘కేజిఎఫ్’ పేరు చెప్పకుండానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హీరో క్యారెక్టర్ ను ‘నీచ్ కమీన్ కుత్తే’ అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేజీఎఫ్ హీరో క్యారెక్టర్రైజేషన్ ను ఎద్దేవా చేస్తూ, అలాంటి సినిమాలను జనం ఆదరిస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
read also : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్
“ఒక సినిమా పేరు చెప్పను కానీ, వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఒక తల్లి.. ‘నువ్వు గొప్పోడివి అవ్వాలిరా’ అంటుంది. బాగా సంపాదించే నలుగురికి ఉపయోగపడాలని దానికి అర్థం. కానీ తల్లి అంతా కావాలి అని అంటుంది. హీరో వెళ్లి ఆ వస్తువును తవ్వే వాళ్లను ఉద్ధరిస్తాడు. ఒక పాట వస్తుంది. వాడు మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాడు” అని విమర్శించారు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడిగితే, అలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి చూస్తున్నాం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Edi sangathi Poduna chudam edu em movies chesado chusi pic.twitter.com/VrHn9FvTnR
— Aria (@reddy_aria) March 5, 2023
READ ALSO : “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?