Telugu News » Blog » ఒక్క సినిమాకు సుకుమార్ ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడో తెలుసా…?

ఒక్క సినిమాకు సుకుమార్ ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడో తెలుసా…?

by AJAY
Ads

ప్ర‌స్తుతం టాలీవుడ్ లోని టాప్ డైరెక్ట‌ర్ల‌లో సుకుమార్ ఒక‌రు. పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా మారిపోయారు. కెరీర్ ప్రారంభంలో సుకుమార్ ప్రేమ‌క‌థ‌లతో మ‌న‌సు దోచుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత సుకుమార్ రూట్ మార్చాడు. నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో లాంటి డిఫ‌రెంట్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాల్లో ఎన్నో లాజిక్స్ తో లెక్క‌ల మాస్టారు అనిపించుకున్నాడు. ఇక సుకుమార్ వ‌రుస‌గా ఒకేర‌క‌మైన సినిమాల‌ను చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రేమో.

sukumar

sukumar

రంగ‌స్థ‌లంతో మ‌రోసారి సుకుమార్ త‌న రూట్ మార్చాడు. ఈ సినిమా సుకుమార్ కెరీర్ లో మ‌రో మైలురాయిగా మారింది. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ లోని న‌టుడిని కూడా సుకుమార్ బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. ఇక రీసెంట్ గా సుకుమార్ పుష్ప సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ విడుద‌ల చేయ‌గా బాలీవుడ్ తో పాటూ అన్ని ఇండ‌స్ట్రీలో క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిసింది. బాలీవుడ్ న‌టీన‌టులు సుకుమార్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక ప్ర‌స్తుతం సుకుమార్ పుష్ఫ‌కు సీక్సెల్ గా పుష్ప 2 ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత సుకుమార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టాప్ ద‌ర్శ‌కుడిగా ఉన్న సుకుమార్ ఎంత రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నారా అని సినీప్రియులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.

అయితే ఇండ‌స్ట్రీలోని టాక్ ప్ర‌కారం సుకుమార్ పుష్ఫ‌కు ముందు 35కోట్ల రెమ్యున‌రేషన్ ను పుచ్చుకునేవార‌ట‌. పుష్ప పార్ట్ 1కు కూడా అంతే పుచ్చుకున్నార‌ట‌. కానీ సుకుమార్ క్రేజ్ పెర‌గ‌టంతో ఇప్పుడు పుష్ప 2 కు ఏకంగా రూ.50 కోట్ల రెమ్యున‌రేష‌న్ ను పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.


You may also like