టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలకు సిద్ధమై ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతకు ముందే ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబంధించి రెండు విడుదల తేదీలు ప్రకటిస్తూ.. నూతన ట్రెండ్‌ను రాజమౌళి సృష్టించాడు. ప్రస్తుతం ఇదే ఫార్ములాను టాలీవుడ్లో పలు సినిమాలు ఫాలో అవుతున్నాయి.
వారం రోజుల కిందట ఆర్.ఆర్.ఆర్ మూవీకి రెండు విడుదల తేదీలను ప్రకటించాడు దర్శక ధీరుడు. మార్చి 18 లేదా ఏప్రిల్ 29న తమ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ ఏ తేదీన విడుదలవుతుందో తెలియక పలువురు తికమక పడ్డారు. తీరా చూస్తే జక్కన్న ఆ రెండు తేదీలను కాదని మార్చి 25వ తేదీని ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ఫిక్స్ చేశాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. మార్చి 17న కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ మూవీ విడుదలవుతుంది. పునీత్ మృతికి నివాళిగా ఈ మూవీ విడుదలైన వారం రోజుల వరకు ఇతర సినిమాలను విడుదల చేయకూడదని కన్నడ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. దీంతో పాన్ ఇండియా మూవీ అయినటువంటి ఆర్.ఆర్.ఆర్ మూవీ మార్చి 25కి వెళ్లిందని ప్రచారం సాగుతుంది.
Advertisement
Advertisement
రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. మూవీ ఫార్ములాను భీమ్లానాయక్ గని, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఫాలో అయ్యాయి. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాను కుదిరితే ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 01న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినది. యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా సైతం ఫిబ్రవరి 25 లేదా మార్చి 04వ తేదీ అని కర్చీప్ వేసింది. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ గతంలో మార్చి 25న విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించగా.. ఆరోజు ఆర్.ఆర్.ఆర్ విడుదలవుతుండటంతో కుదిరితే మార్చి 25 లేదా ఏప్రిల్ 15న వస్తాం అని తాజాగా ప్రకటించారు. టాలీవుడ్ దర్శక ధీరుడు ఏదైనా సృష్టిస్తే ఇప్పుడు అందరూ దానిని ఫాలో కావడం ఒక ట్రెండ్‌గా మారింది.
Also Read : డబ్బుతో వస్తువులు కొనవచ్చు కానీ బుద్దిని కొనలేం…యువకుడి పై రష్మీ ఫైర్…!