Home » Kalki: కల్కి ప్రాజెక్ట్ లోకి రాజమౌళి ఎంట్రీ.. ఏ డిపార్ట్మెంట్ లోకి అంటే?

Kalki: కల్కి ప్రాజెక్ట్ లోకి రాజమౌళి ఎంట్రీ.. ఏ డిపార్ట్మెంట్ లోకి అంటే?

by Srilakshmi Bharathi
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో కేజ్రీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రాజెక్ట్ K ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ “ఆదిపురుష్” గా నిరాశపరచడంతో సలార్ సినిమాతో పాటు, ఈ సినిమా పైనే ఆయన ఫాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంపైనా ఫోకస్ చేస్తున్నారు.

prabhas rajamouli

Advertisement

ప్రాజెక్ట్ k సినిమా టైటిల్ ను కల్కి గా డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తో సహా పలువురు టాప్ నటులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా కల్కి నుంచి గ్లిమ్ప్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఫాన్స్ అంచనాలను బీట్ చేసేలా ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేసారు.దీనితో ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. నాగ్ అశ్విన్ ప్రతిభ ఈ ఒక్క గ్లిమ్ప్స్ లోనే కనిపిస్తోందని ఆయనను ఆకాశానికెత్తేశారు.

Advertisement

rajamouli

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో ట్రెండింగ్ వార్త ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. అదేంటంటే.. కల్కి ప్రాజెక్ట్ లో రాజమౌళి కూడా పని చేస్తుండడం. ఇప్పటికే ఆయన ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన తన డైరెక్షన్ లో షూటింగ్ కూడా మొదలు పెట్టేశారని తెలుస్తోంది. ఒక్క పరాజయాన్ని చూడని డైరెక్టర్ గా, ఇండియాకి ఆస్కార్ తీసుకొచ్చిన డైరెక్టర్ గా రాజమౌళికి ఇప్పటికే పేరు వచ్చేసింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చలు జరిపేస్తోంది.

మరిన్ని..

నాగార్జున, అమల పెళ్లికి ఏఎన్నార్ దూరంగా ఉండటానికి కారణం ఏంటి ? ఆ నిర్మాతే వీరి పెళ్లి చేశాడా ?

అన్వేష్ ప్రేమ- పెళ్లి- విడాకులపై కీలక వ్యాఖ్యలు!

మినిస్టర్ రోజా భర్త సెల్వమణికి అరెస్ట్ వారెంట్…!

Visitors Are Also Reading