టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. ఈ చిత్రంలో మహేష్ బాబు కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది సర్కారు వారి పాట. ఇక ఇదిలా ఉంటే.. కొరటాల శివకి, పరశురామ్ కి లింకు ఏమిటి అని మీకు ప్రశ్న రావచ్చు. అది ప్రత్యక్షంగా ఏమి లేదు కానీ పరోక్షంగా మాత్రం వీరిద్దరికీ లింక్ ఉందనే చెప్పవచ్చు. ఈ చిత్రం కథను మహేష్ బాబు వద్దకు తీసుకెళ్లడంలో పరశురామ్‌కి సాయం చేసింది కొరటాల శివ కావడం విశేషం. అందుకే కొరటాల శివకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు పరశురామ్.
మహేష్‌బాబుకు కథ చెప్పడానికి ముందు చాలా భయపడ్డాను అని.. తొలి ఐదు నిమిషాల స్టోరీ నరేట్ చేసాక మహేష్ ఫేస్‌పై ఓ చిరునవ్వు చూసినట్టు వెల్లడించాడు పరశురామ్. తనను నమ్మి అవకాశం ఇచ్చినందుకు మహేష్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. అంతేకాదు.. తన విజన్‌ను వెండితెరపై తీసుకెళ్లడంలో ఎక్కడా రాజీ పడకుండా తనకు అండగా నిలిచి.. తాను అడిగినదంతా సిద్ధం చేసిన నిర్మాతలకు ప్రత్యేకంగా పరశురామ్ కృతజ్ఞతలు చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని.. థమన్ అయితే అద్భుతమైన సంగీతం అందించాడని కొనియాడారు దర్శకుడు పరశురామ్. మే 12న కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తున్నామని బల్లగుద్దీ మరీ చెప్పాడు దర్శకుడు.
Advertisement
Advertisement
పోస్టర్స్ విడుదల అవుతున్నప్పటి నుంచే ఈ చిత్రంపై క్రమంగా పెరుగుతూ వస్తుండగా.. ట్రైలర్ విడుదలైన తరువాత అవి ఇంకా అంచనాలు భారీగా పెరిగాయి. పోకిరి తరుఆత వింటేజ్ మహేష్‌బాబు కనిపించడంతో ఈ చిత్రంపై ఆడియన్స్ భారీ ఎక్స్‌ఫెక్టేషన్స్ పెట్టుకున్నారు. తాము ఎలాగైతే.. మహేష్‌ను చూడాలని అనుకుంటున్నామో.. అదేవిధంగా ట్రైలర్‌లో కనిపించడంతో సినిమా విడుదల కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇలా చూస్తుంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తాండవం చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read :
పుచ్చకాయలో ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఇలా గుర్తించండి..!
Bigg Boss OTT Telugu: వారి వల్లనే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చానన్న సరయూ