భారత జట్టులోకి వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 37 ఏళ్ళ వయస్సులో రి ఎంట్రీ అనేది ఇచ్చాడు. అయితే ఈ ఏజ్ లో జట్టులో కొనసాగడమే కష్టం అంటే.. రి ఎంట్రీ ఇవ్వడం అంటే ఇంకా కష్టం. కానీ దినేష్ ఆ పనిని చేసి చూపించాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత జట్టు నుండి వాయతకు వచ్చిన దినేష్ ను మల్లి అవకాశాలు అనేవి రాలేదు.
Advertisement
దాంతో కామెంట్రీలోకి వచ్చిన దినేష్ కార్తీక్ ను ఈ ఏడాది ఐపీఎల్ యొక్క మెగవేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు అనేది తీసుకుంది. మొదట అతనిపై ఏ అంచానాలు లేకపోయినా.. దినేష్ మాత్రం సూపర్ హిట్టింగ్ తో సక్సెస్ అయ్యాడు. జట్టు తరపున ప్రతి మ్యాచ్ ఆడి మంచి ఫినిషర్ గా గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపే దినేష్ కార్తీక్ కు టీం ఇండియాలో కూడా ప్లేస్ అనేది కల్పించింది.
Advertisement
అయితే తాజాగా తాను ఇప్పుడు ఇలా సక్సెస్ కావడం గురించి దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అని పేర్కొన్నాడు. వారు నాపై నమ్మకం ఉంచి.. నాకు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు నేను ఆ నమ్మకం అనేది వమ్ము చేయకుండా ఆడాలని చూస్తున్నాను. నా పై ఉన్న నమ్మకానికి రిటర్న్ గిఫ్ట్ గా వారికీ నా బ్యాటింగ్ ద్వారా ఇస్తాను అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :