Home » Dil Movie: దిల్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

Dil Movie: దిల్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

by Bunty
Ad

దిల్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో ఇద్దరి మధ్య ప్రేమని చక్కగా చూపించారు. ఈ సినిమాలో నితిన్, నేహా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నితిన్ తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక నేహా తన అందం, అమాయకత్వం, నటనతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టింది.

Dil Actress Neha Present Life Real Story In Telugu

ఈ అమ్మడు ఎంతో అందం, నటన ఉన్నప్పటికీ హీరోయిన్గా పెద్దగా రాణించలేకపోయింది. ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత సినిమాలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సైడ్ క్యారెక్టర్లలో నటించింది. అందులోనూ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సీరియల్స్ లో నటించింది. సినిమాల్లో కాకుండా సీరియల్స్ లో నేహా అద్భుత విజయాన్ని అందుకుంది. సీరియల్స్ లో నటిస్తూ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగింది.

Advertisement

Dil Actress Neha Present Life Real Story In Telugu

ఇక సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే 2010 సంవత్సరంలో కృశాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. వివాహ అనంతరం తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికే కేటాయించింది నేహా. ప్రస్తుతం ఈ అమ్మడు మునుపటిలా కాకుండా కాస్త అందం తగ్గిపోయింది. అయినప్పటికీ నేహాకి అభిమానులు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. హీరోయిన్ కి మించిన అందం ఉన్నప్పటికీ సినిమాల పరంగా ప్రేక్షకులు తనను ఆదరించలేకపోయారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading