సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరు అయినా ఉన్నారు అంటే అందరికీ ముందుకు గుర్తుకు వచ్చేది విక్టరీ వెంకటేష్ మాత్రమే.
Advertisement
కామెడీ, యాక్షన్ అండ్ లవ్ ఎలాంటి చిత్రమైన సరే వెంకటేష్ కి ఇట్టే సూట్ అయిపోతుంది. అలాంటి వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబోలో వచ్చిన సినిమా నువ్వు నాకు నచ్చావు. లవ్ అండ్ కామెడీ బేస్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అలాంటి మూవీ వచ్చి దాదాపు 22 ఏళ్లు అయిన సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ తండ్రి ప్రకాష్ రాజ్, చంద్రమోహన్ మంచి స్నేహితులు. అయితే హీరో వెంకటేష్ చంద్రమోహన్ కొడుకు. వెంకటేష్ కు ఏదైనా పని చూడమని ప్రకాష్ రాజ్ దగ్గరికి పంపిస్తాడు. ఇదే తరుణంలో వెంకటేష్- ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమ చిగురిస్తుంది అనేది ఈ సినిమా కథ. కట్ చేస్తే ఆర్తి అగర్వాల్ కు చెల్లెలిగా పింకీ పాత్రలో సుదీప నటించింది. అయితే వెంకటేష్ ప్రకాష్ రాజ్ ఇంటికి వచ్చినప్పుడు పింకీ తనకి తానే పరిచయం చేసుకుంటుంది.
Advertisement
తాను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ అని చెబుతుంది. కానీ ఒక సీన్ లో పింకీ స్కూల్ బస్సు ఎక్కే సమయంలో ఆ బస్సు మీద బీవీబీపీ అని స్కూల్ పేరు రాసి ఉంటుంది. అంటే పింకీ లిటిల్ ఫ్లవర్ అని చెబుతుంది ఈ బస్సు మీద ఈ పేరు ఉండడంతో ఇది గుర్తించిన నెటిజన్స్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ డైరెక్టర్ ఎలా మిస్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనప్పటికీ అప్పట్లో నువ్వునాకు నచ్చావు మూవీ సూపర్ హిట్ సాధించడం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ కళ్యాణ్ కాలేజీలో ఉండగానే ప్రేమలో పడ్డాడా..? ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా ?
జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుందంటే..?