తెలుగు సినిమా ఇండస్ట్రీ తొలినాళ్లలో ఎన్టీఆర్, ఏఎన్నార్,శోభన్ బాబు,కృష్ణ ఇలా ఎంతో మంది నటులు వారి వారి నటనతో అద్భుతమైన సినిమాలు చేశారు. అలనాటి కాలం నుంచి తెలుగు ఇండస్ట్రీలో మూవీ మొగల్ గా పేరు పొందిన రామానాయుడు నిర్మాతగా చేస్తూ వచ్చారు. ఆయన ఇండస్ట్రీ తొలినాళ్లలో సాంఘిక,జానపద, పౌరాణిక చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలా ఆయన మొట్టమొదట తీసిన సినిమా రాముడు భీముడు. ఇందులో ఎన్టీఆర్ హీరో.. అయితే ఈ సినిమా కంటే ముందు ఆయన అనురాగం అనే చిత్రం కూడా తీసారట.
Advertisement
Also Read:చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరు ? ఎందుకు అన్నది ?
కానీ అది అంతగా ఆడక పోవడంతో ఎవరికి తెలియలేదు.. కానీ రాముడు భీముడు సూపర్ హిట్ అవడంతో రామానాయుడు అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నిర్మించి మంచి సక్సెస్ రేట్ తో దూసుకెళ్తూ వచ్చారు.. అలా రామానాయుడు నిర్మాణ సారధ్యంలో వచ్చిన మూవీ బొమ్మలు చెప్పిన కథ. ఈ సినిమా 1969 ఏప్రిల్ 4వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు జి విశ్వనాథం డైరెక్టర్. ఇందులో కృష్ణ హీరోగా చేయగా ప్రభాకర్, కాంతారావు, రాజబాబు, విజయనిర్మల, గీతాంజలి, విజయ లలిత, హేమలత వంటి స్టార్ నటులు చేశారు.
Advertisement
Also Read:Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?
ఇందులో విజయనిర్మల కాంతారావు పక్కన నటిస్తే, కృష్ణ పక్కన గీతాంజలి చేసింది. కానీ ఇందులో విజయనిర్మల కృష్ణ అన్నా చెల్లెలుగా నటిస్తారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కృష్ణ విజయనిర్మల ఈ ఒక్క సినిమాలోనే కాకుండా మంచి మిత్రులు, ముహూర్త బలం అనే సినిమాలలో కూడా అన్నా చెల్లెళ్లుగా చేసి మెప్పించారు. ఇక ఈ మూడు సినిమాలు తప్ప మరెప్పుడు వీరు కలిసి అన్నా చెల్లెళ్లుగా నటించలేదు. అయితే బొమ్మలు చెప్పిన కథ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 54 సంవత్సరాలు పూర్తయింది. అన్నా చెల్లెళ్లుగా నటించిన కృష్ణ , విజయనిర్మల మన ముందు లేరని చెప్పుకోవడం బాధాకరం..