Home » Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?

Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?

by Bunty
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరమే లేదు. డిసెంబర్ 17, 2021న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అందరి మన్ననలను పొందింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి గుర్తింపును దక్కించుకుంది.

read also : IPL 2023 : సిక్సుతో కారు ధ్వంసం..గైక్వాడ్ కు రూ.5 లక్షల రివార్డు

Advertisement

త్వరలోనే పుష్ప 2 విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారట. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పుష్ప 2 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం.

Advertisement

READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

పుష్ప ది రూల్‌ అప్‌డేట్‌ రాబోతుంది

ఇవాళ రష్మిక పుట్టినరోజు సందర్భంగా… ఈ సినిమా నుంచి శ్రీవల్లి లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే కాసేపటి క్రితం ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప… అసలు పుష్ప ఎక్కడ? అంటూ వాయిస్ వినిపిస్తుండగా… పుష్ప 2 సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇక దీనిపై క్లారిటీ ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Visitors Are Also Reading