Home » మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా సినిమాల్లో నటించిన విషయం మీకు తెలుసా ?  

మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా సినిమాల్లో నటించిన విషయం మీకు తెలుసా ?  

by Anji
Ad

తెలుగు చలన చిత్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటేనే అభిమానులకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇతను సొంతంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి నటుడు అవ్వాలనుకున్నప్పుడు బీకాం పూర్తి చేసిన తరువాత మద్రాస్ లోని దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. ఆ కోర్సు పూర్తయ్యే సమయానికి పునాది రాళ్లు సినిమాలో అవకాశం లభించింది. 

Also Read: బాలయ్య, ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. చూశారా ? 

Advertisement

గూడపాటి రాజ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ చిత్రంలో  ఫస్ట్ పొలంలో నలుగురు స్నేహితులతో కలిసి చిరంజీవి పని చేస్తుంటాడు. షూటింగ్ సమయంలో రియలిస్టిక్ గా ఉంటుందని నాలుగు గడ్డి పోచలు తలపై పెట్టుకున్నాడట. అది చూసిన కెమెరా మెన్ భవిష్యత్ లో స్టార్ హీరోగా కొనసాగుతావని చెప్పాడట. ఇక ఆ తరువాత ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మన ఊరి పాండవులు’ అనే సినిమాలో అవకాశమిచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నటనను చూసి బాపుగారు మరో సినిమాను మెగాస్టార్ తో చేయాలనుకున్నారు. ఆ చిత్రమే మంత్రిగారి వియ్యంకుడు. ఈ సినిమాలో చిరంజీవి పూర్ణిమ జయరాం జంటగా నటించారు. జయకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ముఖ్యమైనటువంటి మంత్రి పాత్రను ఎవరితో చేయిస్తే బాగుంటుందనే డిస్కర్షన్ వచ్చినప్పుడు వెంటనే.. ‘అల్లు రామలింగయ్య మా బావగారితో వేయిద్దామా’ అని ఓ సలహా ఇచ్చారట.

Advertisement

Manam News

అలా చిరంజీవి తండ్రి ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో వెంకట్రావు మంత్రిగా కనిపించారు. దీనికంటే ముందే చిరంజీవి తండ్రి ఓ సినిమాలో నటించారు. ఆ చిత్రం 1969లో వచ్చిన జగత్ జెట్టీలు. ఈ చిత్రం తరువాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలొచ్చినా కుటుంబ బాధ్యతల వల్ల ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. నటుడిగా మాత్రం కంటిన్యూ చేయలేదు. చిరంజీవి తండ్రి  వెంకట్రావు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పని చేసేవారు. దీంతో ఆయన సినిమాల్లో రాలేకపోవడం.. పూర్తి స్థాయి నటుడిగా మారడానికి సాధ్యం కాలేదు. చిరంజీవి కూడా సినిమాల్లోకి రాకుండా ఉంటే.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉండేవారు. ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ అయ్యారు. ఇలా చిరంజీవి తండ్రి వెంకట్రావు సినిమాల్లోకి వచ్చారు. 

Also Read :  ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో నటించిన జూనియర్ విజయశాంతి గురించి మీకు తెలుసా ? 

Visitors Are Also Reading