Home » జూనియ‌ర్ ఎన్టీఆర్‌, వ‌డ్డె న‌వీన్ బావ, బావ‌మ‌రుదులు అని మీకు తెలుసా..?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, వ‌డ్డె న‌వీన్ బావ, బావ‌మ‌రుదులు అని మీకు తెలుసా..?

by Anji
Ad

ఇదివ‌ర‌కు ఎంతో మంది హీరోలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేశారు. అందులో ఉద‌య్‌కిర‌ణ్‌, త‌రుణ్‌, వ‌డ్డే న‌వీన్ ఇలా చాలా మంది ఉన్నారు. వ‌డ్డే న‌వీన్ కూడా వ‌రుస హిట్ల‌ను అందుకుని మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ త‌రువాత ఫ్యామిలీ హీరోగా మారాడు. 1997లో విడుద‌లైన కోరుకున్న ప్రియుడు సినిమాతో న‌వీన్ తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

Also Read : ఆర్ఆర్ఆర్‌లో తార‌క్‌, చ‌ర‌ణ్ హీరోల‌ని శ్రియ‌కు తెలియ‌ద‌ట‌..!

Advertisement

ఈ సినిమా మంచి విజ‌యమే సాధించింది. ఆ త‌రువాత న‌వీన్‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కాగా న‌వీన్ ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి కార‌ణం త‌న తండ్రి వ‌డ్డే ర‌మేష్ అంట‌. ర‌మేష్ నిర్మాత కావ‌డంతో న‌వీన్‌కు కూడా సినిమాల‌పై ఆస‌క్తి ఏర్ప‌డింద‌ట‌. కానీ ప్ర‌స్తుతం న‌వీన్ ఇండ‌స్ట్రీకి చాలా దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా.. వ‌డ్డే న‌వీన్ నంద‌మూరి కుటుంబానికి అల్లుడు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. ఎన్టీఆర్ కొడుకుల‌లో ఒక‌రైన నంద‌మూరి రామకృష్ణ కూతురును వ‌డ్డె న‌వీన్ పెళ్లి చేసుకున్నారు. ఆ సంబంధాన్ని కూడా ఎన్టీఆర్ సెట్ చేశార‌ట‌.

Advertisement


ఎన్టీఆర్ కు వ‌డ్డె న‌వీన్ మంచి స్నేహితుడ‌ని అప్ప‌ట్లో టాక్ న‌డిచేది. పెళ్లికి ముందే వ‌డ్డె న‌వీన్ రామ‌కృష్ణ కూతురు తో ప్రేమ‌లో ఉండేవాడ‌ట‌. ఎన్టీఆర్ వ‌ల్ల ఈ పెళ్లి జ‌రిగింద‌ని స‌మాచారం. అయితే ఆ త‌రువాత ఏమి జ‌రిగిందో కానీ వ‌డ్డె న‌వీన్ విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకున్నారు. నంద‌మూరి కుటుంబంతో బంధుత్వం తెంచుకున్నారు. కానీ నంద‌మూరి హీరో ఎన్టీఆర్‌తో మాత్రం న‌వీన్ స‌న్నిహితంగా ఉన్నారంట‌. ఈ విష‌యం అత కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు.

Also  Read : బ‌స‌వ‌తార‌కం ట్ర‌స్ట్ కోసం ఎన్టీఆర్ చేసిన చివ‌రి సినిమా ఇదే..!

Visitors Are Also Reading