Home » అక్కడ లభించే తేనె చేదుగా ఉంటుందనే విషయం మీకు తెలుసా ? 

అక్కడ లభించే తేనె చేదుగా ఉంటుందనే విషయం మీకు తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా తేనె చాలా తియ్యగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. తేనె చేదుగా కూడా ఉంటుందంటే మీరు నమ్మతారా..? నమ్మలేము అనుకున్నా.. నమ్మి తీరాల్సిందే. ఎందుకు అంటే కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో చేదు తేనె లభిస్తుంది. బిలిగిరంగన అనే కొండల్లో తీపి తేనెతో పాటు చేదు తేనెను కూడా సేకరిస్తుంటారు అక్కడ స్థానికులు. వైలెట్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్, బీట్ ఫ్లవర్ మకరందాన్ని పీల్చే తీనెటీగలు ఆ సీజన్ లో ఉత్పత్తి చేసే తేనె చేదుగా ఉంటుంది.

Advertisement

ఈ సీజన్ లో గ్రామస్తులు నేరుగా అడవులకు వెళ్లి చేదు తేనెను సేకరిస్తుంటారు. గతంలో అడవి నుంచి సేకరించిన తేనెతో కలిపి ప్రాసెస్ చేసేవారు. కానీ కొద్ది రోజులు దీనికి అడవి అనే పేరు పెట్టి.. నేరుగా చేదు తేనెను మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చేదు తేనెతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అక్కడి గిరిజనులు పేర్కొంటున్నారు. షుగర్ వ్యాది గ్రస్తులకు తీపి తేనె కంటే చేదు తేనె చాలా ప్రయోజనాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చేదు తేనెలో ఔషదగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. దీనిని వినియోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.  

Advertisement

Also Read :  అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది ఆ ఒక్కటి మాత్రమే.. అది మీకు ఉన్నాయా..?

తేనెను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి ఆహారాలు, నీటిలో కలపకుండా చూసుకోవాలి. వేడి వాతావరణంలో పని చేస్తున్న వారు తేనె తినకూడదు. తేనెను నెయ్యితో కలుపవద్దు. వేడి మసాలా ఆహారాలు, పులియబెట్టిన పానీయాలు విస్కీ, రమ్ బ్రాండీతో అస్సలు కలుపొద్దు. స్పైసీ ఫుడ్ తో కలిపి తేనెని తీసుకున్నప్పుడు పొట్టలో ఇబ్బంది కలిగిస్తుంది.  

Also Read :  సొహెల్ నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా ?

Visitors Are Also Reading