Home » డైరెక్టర్ బాబీకి గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఉన్న బంధుత్వం గురించి తెలుసా ?

డైరెక్టర్ బాబీకి గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఉన్న బంధుత్వం గురించి తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. గుంటూరుకి చెందిన ద్రోణవల్లి రమేష్, స్వర్ణ దంపతుల కూతురు హారిక. ఈమె ఏడేళ్ల వయస్సులో చదరంగంలోకి దిగింది. పదేళ్లలో యూ-10, పన్నేండేళ్లలో యూ-12 పోటీలలో ఆసియా ఖండంలో  తొలిస్థానాన్ని సంపాదించుకుంది హారిక. చెస్ లో మంచి ప్రతిభ కనబరిచి.. ఇంటర్నేషనల్ లెవల్ లో ఎన్నో పతాకాలను సాధించింది. మరోవైపు వరల్డ్ ఛాంపియన్ షిప్ ని సైతం కైవసం చేసుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా అందజేసింది. కోనేరు హంపి తరువాత గ్రాండ్ మాస్టర్ అయినటువంటి రెండో మహిళ హారికనే కావడం విశేషం.

Advertisement

హారిక టాలీవుడ్ దర్శకుడు బాబీ(కే.ఎస్.రవీంద్ర)కి మరదలు అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. హారిక సిస్టర్ అనూషను బాబీ పెళ్లి చేసుకున్నాడు. అందుకే బాబీ సినిమాలు విడుదలయ్యే సమయంలో అప్పుడప్పుడు హారిక విషెష్ చెబుతుంటారు. తాజాగా వైజాగ్ లో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని టీవీలో వీక్షించిన హారిక.. బాబీతో పాటు చిరు మాట్లాడుతున్న సమయంలో తీసిన పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన బావ బాబీకి బెస్ట్ విషెస్ చెప్పారు.  “సో సో సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేశావో నాకు తెలుసు. నీ నుంచి రాబోయే విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నా అని ట్వీట్టర్ వేదికగా రాసుకొచ్చారు హారిక. బాబీ లాస్ట్ ఫిల్మ్ వెంకీమామ విడుదలైన సమయంలో కూడా హారిక ఇలాగే శుభాకాంక్షలు చెప్పారు. 

Advertisement

Also Read :  బాలకృష్ణ, రవితేజ మధ్య ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?

మొదట రైటర్ గా పని చేసిన బాబీ.. రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో దర్శకుడయ్యాడు. ఈ చిత్రం బాగానే ఆడింది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని తీశారు. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ తెరకెక్కించిన జై లవకుశ సినిమా సూపర్ హిట్ సాధించింది. 2019లో వచ్చిన వెంకీమామ కాస్త నిరాశ పరిచింది. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబోలో వాల్తేరు వీరయ్య పేరుతో పక్కా మాస్ సినిమా తీశాడు బాబీ. సంక్రాంతి కానుక ఈనెల 13న ఈ సినిమా విడుదలవుతుంది. 

Also Read :  వాల్తేరువీరయ్య ట్రైలర్ లో ఉన్నటువంటి ఈ 5 మైనస్ లను మీరు గమనించారా..?

Visitors Are Also Reading