Home » సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంగం అధ్యక్షుడిగా చిరంజీవి ! వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసారా ?

సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంగం అధ్యక్షుడిగా చిరంజీవి ! వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసారా ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ అనే చెప్పాలి. తెలుగు సినిమా చలన చిత్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ నిలబడిన కృష్ణకు.. లెక్కలేనంత అభిమానులు ఉన్నారు. నందమూరి తారకరామారావు తరువాత అంతటి క్రేజ్, అభిమానులు ఆయన సొంతం. కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవంటే.. ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఉండేవారో అర్థం చేసుకోవచ్చు.

Krishna and Chiranjeevi Images

Krishna and Chiranjeevi Images

 

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రతీ గ్రామంలో కృష్ణ అభిమాన సంఘాలు ఉండేవి. కృష్ణ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించేవారు. కృష్ణ పుట్టినరోజు వచ్చిందంటే చాలు.. నాడు వార్తాపత్రికలకు పండుగే అని చెప్పాలి. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేవారు. తర్వాత దశలో కృష్ణ అభిమాన సంఘాలు, నటవారసుడిగా వచ్చిన మహేష్ బాబు అభిమాన సంఘాలు 2008లో విలీనమైపోయి సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఏర్పడ్డాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కృష్ణకు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా పెద్ద ఫ్యాన్స్‌ ఉన్నారు.

Advertisement

Advertisement

వీరిలో మెగాస్టార్ చిరంజీవి సైతం కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అవును.. సూపర్ స్టార్ కృష్ణ అంటే చిరంజీవికి ఎంతో అభిమానం ఉండేది. చిరంజీవి యువకుడిగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిగా ఉండేవారు. ఈ క్రమంలోనే.. పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు నేటి మెగాస్టార్. ‘తోడు దొంగలు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ అభిమాన సంఘం పేరిట విడుదల చేసిన కరపత్రం నేటికీ చాలా స్పెషల్‌గా నిలుస్తోంది.  కృష్ణ.. అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న చిరంజీవి.. సినిమాల్లోకి రావడానికి కూడా కృష్ణను స్ఫూర్తిగా తీసుకున్నారని చెబుతుంటారు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading