Telugu News » Blog » రాజ‌మౌళి మ‌గ‌ధీర సినిమాకి నో చెప్పి త‌ప్పు చేశానంటున్న న‌టి అర్చ‌న‌..!

రాజ‌మౌళి మ‌గ‌ధీర సినిమాకి నో చెప్పి త‌ప్పు చేశానంటున్న న‌టి అర్చ‌న‌..!

by Anji
Ads

హీరోయిన్‌గా తెలుగు తెర‌పై త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది న‌టి అర్చ‌న‌. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లో కూడా న‌టించి మెప్పు పొందింది. అర్చ‌న అందం, అభిన‌యం ప్రేక్ష‌కుల మ‌న‌స్సు దోచుకున్న‌ప్ప‌టికీ సినీ ఇండ‌స్ట్రీ ఆమెకు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పుకోవాలి.

Advertisement

తెలుగులో నేను సినిమాతో అర్చ‌న‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొంచెం ట‌చ్‌లో ఉంటే చెబుతాను, సూర్యం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీ‌రామ‌దాసు, పౌర్ణ‌మి, సామాన్యుడు, అత్తిలి స‌త్తిబాబు, ఎల్‌కేజీ, య‌మ‌దొంగ‌, పాండు రంగ‌డు, ఖ‌లేజా, ప‌ర‌మవీర చ‌క్ర, బ‌లుపు, క‌మ‌ల‌తో నా ప్ర‌యాణం, పంచ‌మి, ల‌య‌న్ వంటి సినిమాల్లో న‌టించింది. ఇక ఆ త‌రువాత త‌న కెరీర్ కొన‌సాగుతుండ‌గానే హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్ జ‌గ‌దీష్‌తో అర్చ‌న‌కు పెళ్లి జ‌రిగింది. పెళ్లి త‌రువాత నుంచి సినిమాల‌కు ఆమె దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవ‌ల ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌కి భ‌ర్త జ‌గ‌దీష్‌తో క‌లిసి వ‌చ్చి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Advertisement


శ్రీ‌రామ‌దాసు సినిమా చేస్తున్న‌ప్పుడు త‌న వ‌య‌సు చాలా చిన్న‌ద‌ని.. సుమ‌న్ రాముడిగా చేస్తే.. ఆయ‌న ప‌క్క‌న సీతాదేవిగా న‌టించాన‌ని అంత బాగా న‌టించ‌డానికి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు గారే కార‌ణం అని చెప్పారు. రాఘ‌వేంద్ర‌రావు సార్‌తో ప‌ని చేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని, మ‌ళ్లీ రాఘ‌వేంద్ర‌రావు గారితో వ‌ర్క్ చేయాల‌ని ఉంద‌ని పేర్కొంది. ప్ర‌ధానంగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌గ‌ధీర సినిమాలో న‌టించే అవ‌కాశం నేను మిస్ అయ్యాన‌ని అర్చ‌న వెల్ల‌డించింది. ఆ సినిమాలో ఓ రోల్ కోసం త‌న‌కు ఆఫ‌ర్ వ‌చ్చినా చేయ‌లేద‌ని.. అప్ప‌ట్లో త‌న‌కు అంత మెచ్యురిటి లేద‌ని చెప్పింది. మ‌గ‌ధీర సినిమాలో ఆ క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేద‌ని అర్చ‌న తెలిపింది.

అర్చ‌న‌, జ‌గ‌దీశ్ మ్యారేజ్ కార్డు ఫ్రింట్ అయ్యాక వెన్యూ మారిపోయింది ఏమిటి అని ఆలీ అడిగిన ప్ర‌శ్న‌కి అర్చ‌న స్పందిస్తూ.. ఇలాంటి ఐడియాలు స‌డెన్‌గా ఇద్ద‌రికీ ఒకేసారి వ‌స్తుంటాయి. ఆ స‌మ‌యంలో ఇక్క‌డే చేసుకుందామా పెళ్లి అని జ‌గ‌దీష్ అన్నాడ‌ని వెల్ల‌డించింది. దీంతో త‌న పెళ్లి వెన్యూ మారిపోయింద‌ని చెప్పుకొచ్చింది. అదేవిధంగా పెద్ద సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చి చివ‌రి క్ష‌ణంలో డ్రాప్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా..? అని ఆలీ అడ‌గ‌డంతో వాటిని గుర్తు చేసుకుంటూ అర్చ‌న క‌న్నీరు పెట్టుకుంది. ఇది ప్రోమోనే కావ‌డంతో అస‌లు మ్యాట‌ర్ రివీల్ చేయ‌లేదు. ఇక ఫుల్ ఎపిసోడ్ విడుద‌ల అయితే అస‌లు అర్చ‌న ఇలా ఎందుకు బాధ‌ప‌డింద‌నేది తెలుస్తుంది.

Also Read : 

తండ్రి అయిన టాలీవుడ్ నిర్మాత‌ దిల్‌రాజు.. వార‌సుడొచ్చాడంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్‌..!

Advertisement

జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ గుడ్ బై.. వైర‌ల్ అవుతున్న కామెంట్స్‌..!