Home » రోల్స్‌-రాయిస్ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? దానివెనుకున్న స్టోరీ ఇదే ?

రోల్స్‌-రాయిస్ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? దానివెనుకున్న స్టోరీ ఇదే ?

by Anji
Ad

ప్ర‌పంచంలో మోస్ట్ ల‌గ్జ‌రీ కారు అంటే రోల్స్ రాయిస్‌.. డ‌బ్బు ఉన్న ప్ర‌తి వ్య‌క్తి రోల్స్ రాయిస్‌ను ఇంటి ముందు అలా పార్కు చేసుకోవాల‌నుకుంటాడు. ఎందుకంటే ఆ కారు ఉంటే ఇంటి ముందు రాజ‌స‌మే కాదు. ఒక స్టేట‌స్‌లాగా క‌నిపిస్తుంది. అందుకే కోట్లు ఖ‌ర్చు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొంటారు. ఇంత ఖ‌రీదు అయిన కారు ప్ర‌స్తావ‌న ఎలా సాగింది. దాని చరిత్ర ఏమిటి..? ప్ర‌స్థానం ఏవిధంగా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rasi phalalu in telugu : ఆ రాశి వారిని ధ‌ర్మ‌మే కాపాడుతుంది

Advertisement

చాలా మంది రోల్స్ రాయిస్ అన‌గానే కార్ల కంపెనీ అనుకుంటారు. కార్ల వ్యాపారం అనేది ఈ కంపెనీకి సైడ్ బిజినెస్ అనేది మీరు న‌మ్మ‌గ‌ల‌రా..? ఇది నిజం. ఎందుకంటే పౌర విమానాలు, యుద్ధ విమానాలు యుద్ధ నౌక‌ల‌కు కూడా ఇంజిన్ టెక్నాల‌జీ స‌ర‌ఫ‌రా చేస్తుంటుంది రోల్స్ రాయిస్ బిజినెస్ ఎంత‌లా పెరిగిందో చెప్ప‌వ‌చ్చు. అయితే స్నేహం అంటే ఎలా ఉండాలో కూడా హెన్నీ రాయిస్‌, చార్లెస్ రోల్స్ ల‌ను చూస్తే తెలుస్తుంది. వీరిద్దరూ పుట్టింది వేరేచోట పెరిగింది వ్యాపారం చేసింది కూడా వేరే చోట. 1863 హెన్రీ రాయిస్ 1863 మార్చి 27న ఇంగ్లాండ్లోని అల్బ‌ర్ట‌న్‌ లో పుట్టారు.

వృత్తిపరంగా ఈయ‌న ఇంజనీర్. చిన‌ప్ప‌టి నుంచి హెన్రీకి డబ్బుల క‌ష్టాలే. అయితే అతని స్నేహితుడైన హెర్నేస్ట్ క్లార్మెట్‌తో కలిసి ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ సమయంలో కొంత డబ్బు తీసుకొని ఆ తర్వాత డైన‌మోస్ నుంచి ఎల‌క్ట్రిక్ ట్రైన్‌ల వ‌ర‌కు ఎన్నో త‌యారు చేసి అమ్మారు. విదేశాల‌కు ఎగుమ‌తి చేసే స్థాయికి ఎదిగినా.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూల‌డంతో
వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. అయితే తనకు మొదటి నుంచి కార్లు తయారు చేయాలనే బలమైన కోరిక మాత్రం ఆయన వదులుకోలేదు.

1877ఆగస్టు 27న లండన్ లో  చార్లెస్ రోల్స్ పుట్టారు. పుట్టుకతోనే ధ‌న‌వంతుడు రోల్స్‌. మెకానికల్ ఇంజనీర్‌. అప్లైడ్ సైన్స్ చ‌దివిన ఈయ‌న ఇంజ‌న్లు త‌యారు చేయ‌డంలో దిట్ట‌. అత‌ని వృత్తి ఏవియేష‌న్‌. మంచి వ్యాపార‌వేత్త కూడా. బ్రిట‌న్‌లో మొట్ట‌మొద‌టి కార్ల డీల‌ర్ షిప్‌ను స్టార్ట్ చేసింది రోల్స్‌. అత‌ని తండ్రి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తో వ్యాపారం బాగానే సాగేది. చార్లెస్ రోజు స్నేహితుడు హెడ్మెండ్స్ బ‌కారణంగా ఒక హోటల్లో హెన్రీతో రోల్స్‌కు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తాను ఇంజన్లు తయారు చేయ‌గ‌ల‌డు. అతను కారు డిజైన్ లు చేయగలడు. అంతేకాదు తయారీకి కావాల్సినవి అన్నీ కూడా కంపెనీ లో ఉన్నాయి. దీంతో ఇద్దరం కలిసి ఒక కారు తయారు చేద్దాం అనుకున్నారు. దానికి రోల్స్ ఒక ఇంజ‌న్ త‌యారు చేశాడు. ఇద్ద‌రు క‌లిసి రోల్స్ రాయిస్ అనే కంపెనీ మీద వ్యాపారం చేద్దామ‌ని అనుకున్నారు. 1904లో రోల్స్ రాయిస్ 10హెచ్‌బీ కారును ఘ‌నంగా విడుద‌ల చేశారు.

Advertisement

 

చీప్ ఇంజ‌నీర్‌గా రాయిస్‌ను నియ‌మించారు. రోల్స్ ఫైనాన్స్ చూసుకునే వారు. సిక్స్త్ సిలిండ‌ర్ సిల్వ‌ర్ గోస్ట్‌ను అదే ఏడాది విడుద‌ల చేశారు. 1907 నాటికి ప్ర‌పంచంలోనే ది బెస్ట్ కారుగా రోల్స్ రాయిస్ న‌మ్మ‌కంగా పేరుగాంచింది. అయితే అక‌స్మాత్తుగా రోల్స్ చ‌నిపోయారు. 1910లో కంపెనీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారిపోయింది. ఎందుకంటే ఇంజ‌న్లు ఎలా త‌యారు చేయాలో ప్ర‌పంచానికి చూపిన మేధావి అత‌ను. అప్ప‌టివ‌ర‌కు ఉన్న ఇంజ‌న్ల‌తో కార్లు బాగానే సేల్ అవుతున్నాయి. కంపెనీ ముందుకు సాగుతుంది. అప్పుడే రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం రావ‌డంతో రోల్స్ రాయ‌ల్‌పై ఒత్తిడి వ‌చ్చింది. రాయ‌ల్స్ త‌న మేధా శ‌క్తితో కొన్ని మార్పులు చేసి ఎయిరో ఇంజ‌న్లు త‌యారు చేసి ఇచ్చారు.

అందులో మొద‌టిది ఈగిల్‌. మొట్ట‌మొద‌టి అధునాత‌న విమానం. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వెల్లిన విమానంగా రికార్డు సృష్టించింది. ఆ త‌రువాత ఎన్నో యుద్ధ విమానాల‌కు ఇంజ‌న్ల‌ను త‌యారు చేసి ఏవియేష‌న్ కంపెనీల‌కు ఇచ్చారు. ఈ ఏవియేష‌న్ ఇంజ‌న్లు త‌యారు చేయ‌డం బాగా క‌లిసొచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే త‌న స్నేహితుడు త‌యారు చేసిన ఇంజ‌న్ల‌కు మార్పులు చేసి పీవీ 12 అనే మోడ‌ల్‌ను విడుద‌ల చేశారు. కంపెనీ లోగోగా ఆర్ఆర్ అనే లోగో పెట్టారు. త‌న స్నేహితుడి పేరు ముందు పెట్టి రోల్స్ రాయిస్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. త‌న స్నేహితుడి ఇంజిన్ అని ఘ‌నంగా చెప్పుకున్నారు. అది స్నేహం అంటే..!అంతేకాదు త‌న స్నేహితుని కుటుంబానికి వాటాలు కూడా ఇచ్చాడు.

వారు ఎవ‌రూ ప‌ని చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ వారికి కావాల్సిన డ‌బ్బుల‌ను ఇచ్చారు రాయిస్‌. అదే వేరే వారు అయితే స్నేహితుడు చనిపోగానే మొత్తం త‌న‌దేన‌ని ఆక్ర‌మించుకుంటాడు. ఆ రోజుల్లోనే ల‌క్ష‌ల కోట్ల వ్యాపారం చేశారు. కానీ రాయిస్ అలా చేయ‌లేదు. ఒక వైపు కార్లు త‌యారు చేస్తూనే.. విమానాల త‌యారీమీద దృష్టిపెట్టారు. 1940లో గ్యాస్ ట‌ర్భ‌న్ ఇంజిన్ త‌యారు చేసింది కూడా రోల్స్ రాయిస్. ఆ విమానం ఒక చరిత్ర‌ను సృష్టించింది. ఆ త‌రువాత డాట్ కంపెనీతో క‌లిసి సివిల్ ఏవియేష‌న్ కంపెనీలోకి వ‌చ్చింది రోల్స్ రాయిస్‌. 1987 నాటికి విమానాలు కార్లు మాత్ర‌మే కాదు. స‌ముద్రంలో వెళ్లే షిప్‌ల‌కు కూడా ఇంజిన్లు త‌యారు చేసింది. ల‌క్ష‌ల కోట్ల కంపెనీగా రికార్డులు క్రియేట్ చేయ‌డం విశేషం.

1990లో ఏయిరో ఇంజ‌న్ జాయింట్ వెంచ‌ర్ బీఎండ‌బ్ల్యూతో క‌లిసి వ్యాపారం మొద‌లు పెట్టింది. బీఎండ‌బ్ల్యూ కార్లు ఒక వైపు, రోల్స్ రాయిస్ కార్లు ఒక‌వైపు ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. 2000 సంవ‌త్స‌రంలో లీగ‌ల్‌గా ఇబ్బందులు రావ‌డంతో రోల్స్ రాయిస్ గ్యూస్ లాండ్ లిమిటేడ్ కంపెనీగా రిజిస్ట్రేష‌న్ చేయించారు. కార్లు వారికి చిన్న వ్యాపారం అయినా కూడా లాభాలు ఎక్కువ‌గా వ‌చ్చే బిజినెస్‌గా మారింది. రోల్స్ రాయిస్ కార్ల మార్కెట్‌ను శాసిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కావాల్సిన‌న్ని రోల్స్ రాయిస్ కార్లున్నాయి. ఇలా సామాన్యంగా మొద‌లై అసామాన్యంగా ఎదిగింది. రోల్స్ రాయిస్ దీనిని దిగ్విజ‌యంగా ముందుకు తీసుకురావ‌డ‌మే స‌క్సెస్‌కు మంత్రం.

Also Read :  పరుచూరి బ్రదర్స్ ను ఇండస్ట్రీ దూరం పెట్టింది…పోసాని సంచలన వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading