Telugu News » Blog » పరుచూరి బ్రదర్స్ ను ఇండస్ట్రీ దూరం పెట్టింది…పోసాని సంచలన వ్యాఖ్యలు…!

పరుచూరి బ్రదర్స్ ను ఇండస్ట్రీ దూరం పెట్టింది…పోసాని సంచలన వ్యాఖ్యలు…!

by AJAY
Published: Last Updated on
Ads

మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పరుచూరి బ్రదర్స్ దగ్గర ఐదేళ్లపాటు అసిస్టెంట్ గా పని చేశానని తెలిపారు. అందరూ వాళ్ళకు అహంభావం ఎక్కువ అని అనుకుంటారని అందులో వాస్తవం లేదన్నారు. వాళ్ళు ఎలా బతకాలో తెలియని వ్యక్తులుని వ్యాఖ్యానించారు. వాళ్ళను చూసిన తర్వాత మాత్రం వాళ్ళలా ఉండకూడదు అని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

కొన్ని వందల సినిమాలకు పని చేశారని అలాంటి వాళ్ళను ఇండస్ట్రీ దూరంగా పెట్టింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ గేయ రచయిత ఆత్రేయ కు కూడా ఇదే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇండస్ట్రీ లో చావు కూడా ఖరీదైన ది గా ఉండాలని అన్నారు. లేదంటే పదిమంది కూడా రారని అన్నారు. సంపద ఉంటే పదివేల మంది వస్తారని అన్నారు. రెండింటి మధ్య ఉండటం ఇష్టం లేక తాను తన కుటుంబం దూరంగా ఉంటున్నామని వ్యాఖ్యానించారు. పరుచూరి బ్రదర్స్ దగ్గరనుండి వచ్చిన తర్వాత నేను నేనుగా బ్రతకాలని ప్రయత్నించాలని చెప్పారు. సినిమా పరిశ్రమ వల్ల రెండు తరాలు కూర్చుని తినగలిగే ఆస్తి సంపాదించా అని చెప్పారు.

You may also like