Home » తెలంగాణలో గ్రూపు 4 పరీక్ష ఎప్పుడో తెలుసా ? 

తెలంగాణలో గ్రూపు 4 పరీక్ష ఎప్పుడో తెలుసా ? 

by Anji
Ad

తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను జారీ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో టీఎస్ఫీఎస్సీ నోటిఫికేషన్లను జారీ చేసింది. తొలుత గ్రూపు-1 నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ పరీక్ష కూడా పూర్తి చేశారు. ఆ తరువాత గ్రూపు 4, గ్రూపు 2, గ్రూపు 3 వంటి పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులు ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు. కొంత మంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటున్నారు. 

Advertisement

డిసెంబర్ 01, 2022న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 లో మొత్తం 9168 గ్రూపు-4 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు వెబ్ నోట్ లో పేర్కొంది. కానీ డిసెంబర్ 30లో విడుదల చేసిన నోటిఫికేషన్ లో మాత్రం 8039 పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ నుంచి అనుకున్న పోస్టుల కన్నా తక్కువ పోస్టులను చూపించడంతో పోస్టులు తగ్గిపోయాయి. దీంతో నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు తేదీని ఎట్టి పరిస్థితిలో పొడగించే అవకాశం లేదని టీఎస్పీఎస్సీ స్పస్టం చేసింది. అభ్యర్థులందరూ సాధ్యమైనంత తొందరగా అప్లై చేసుకోవాలని సూచించింది. 

Advertisement

Also Read :   జబర్దస్త్ లో అప్పుడు హైపర్ ఆదికి ఎంత ఇచ్చారు.. ఇప్పుడు సద్దాంకి ఎంత ఇస్తున్నారంటే..?

Manam News

గ్రూప్ 4 నోటిఫికేషన్ 

జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ అసిస్టెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ వంటి విభాగాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షను ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షను నిర్వహిస్తామని గ్రూప్-4 నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే మే 07, 2023న గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 300 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ 150 మార్కులు, రెండో పేపర్ లో సెక్రటేరియల్ ఎబిలిటీ నుంచి 150 మార్కులు ఉంటాయి. 2018లో నిర్వహించిన గ్రూప్-4 కంటే ఈ సారి ప్రశ్నల స్థాయి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన గ్రూపు-1 ఫిలిమ్స్ ఏ రేంజ్ లో ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. గ్రూప్-4 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ  4నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించండి. 

Also Read :  తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 544 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌.. పోస్టుల వివరాలు, తేదీలు ఇవే

Visitors Are Also Reading