హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం.. సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో విలువ ఉన్నది. ముఖ్యంగా సూర్య, చంద్ర గ్రహణాలు పట్టే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని పలువురు పండితులు పేర్కొంటారు. ఈ తరుణంలో ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఈనెల 30న ఏర్పడనున్నది.
Advertisement
ఈ సూర్యగ్రహణం వచ్చే రోజు అమవాస్యతో పాటు శనివారం కావడం సంతరించుకున్నది. హిందూ శాస్త్రాల ప్రకారం.. గ్రహణాలను అశుభముగా పరిగణిస్తుంటారు. ఇది తొలి పాక్షిక సూర్య గ్రహణం కాగా.. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహాసముద్ర ప్రాంతాల వాసులు సూర్యస్తమయానికి కొద్ది సమయం ముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చని నాసా పేర్కొంది.
Advertisement
ఉరుగ్వే, చిలీ, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటినీ, నైరుతి బొలివియా, ఈశాన్యంలో ఉన్నటువంటి పెరు, నైరుతి బ్రెజిల్ దేశాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యస్తమయం సమయంలో గ్రహణం కనిపిస్తుందని వెల్లడించింది. సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు అని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభం అయి మే 01 ఉదయం 04.07 గంటలకు ముగుస్తుందని నాసా పేర్కొంది. ఈ గ్రహణ సమయంలో భారత్‌లో రాత్రి అవుతుందని వెల్లడించారు.
Also Read :
ఆచార్య చిత్రంపై దర్శకుడు కొరటాల కామెంట్స్ వైరల్..ఆశ్చర్యం వ్యక్తం చేసిన అభిమానులు
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల