Home » నాగార్జునతో అలా చేయటం వల్లే ఈ హీరోయిన్ కెరీర్ నాశనం అయిందా.. మళ్లీ నాగ్ ఛాన్స్ ఇస్తున్నారా..?

నాగార్జునతో అలా చేయటం వల్లే ఈ హీరోయిన్ కెరీర్ నాశనం అయిందా.. మళ్లీ నాగ్ ఛాన్స్ ఇస్తున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు కింగ్ నాగార్జున.. ఇప్పటికే ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆరు పదుల వయసు దాటిన నాగార్జున ఇప్పటికి కుర్ర హీరో లాగే కనిపిస్తారు. అయితే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నడిపించడమే కాకుండా ఆ స్టూడియో ద్వారా ఎంతో మంది కొత్త కొత్త వారిని పరిచయం చేస్తారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో నాగార్జున ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉంటారు..ఫేడౌట్ అవుతున్నటువంటి రమ్యకృష్ణ లాంటి వారికి మళ్లీ ఛాన్స్ ఇచ్చి ఫామ్ లోకి తీసుకువచ్చారు.  సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు వంటి సినిమాల్లో రమ్యకృష్ణ ను ఎంచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే..

ALSO READ:ప‌ల్స‌ర్ బైక్ పాట‌తో పాపుల‌ర్ అయిన ఝూన్సీ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..? అవి తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు…?

Advertisement

Advertisement

ఇలా నాగార్జునతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వారే ఎక్కువగా ఉన్నారు కానీ, ఆయనతో చేసి డల్ అయిపోయిన వారు చాలా తక్కువ మందే అని చెప్పవచ్చు.. కానీ ఇందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ఉంది.. రకుల్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయింది.. అలాంటి ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.. ఎవరైనా ఛాన్స్ ఇస్తారా అని పర్సనల్ గా కాంటాక్ట్ కూడా చేస్తుందట. అయితే రకుల్ కెరియర్ దెబ్బతినడానికి ప్రధాన కారణం నాగార్జున. ఆయన సరసన మన్మధుడు 2 లో హీరోయిన్ గా నటించింది..

తాత వయసులో ఉన్న నాగార్జునతో లిప్ లాక్ ఇవ్వడంతో అభిమానులు తట్టుకోలేక పోయారు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.. ఇటీవల క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన కొండపోలం అంతగా ఆడలేదు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ డి గ్లామరస్ గా కనిపించడంతో అభిమానులంతా అందరించలేకపోయారు.. ఇలా నాగార్జున వల్ల తన కెరియర్ దెబ్బతిన్నది కాబట్టి, మళ్లీ హీరో నాగార్జున రకుల్ ను ఆదుకోవాలి అనుకుంటున్నారట. అది ఏ సినిమాలో అనే విషయం తెలియదు కానీ మళ్ళీ ఆమెను ఫామ్ లోకి తీసుకురావడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. మరి మళ్లీ అవకాశం వచ్చినా కానీ రకుల్ ప్రీత్ సింగ్ హిట్ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

ALSO READ:లైగర్ ప్లాప్ అయిన ధైర్యం చేస్తున్న దిల్ రాజు..!

Visitors Are Also Reading