Home » లైగర్ ప్లాప్ అయిన ధైర్యం చేస్తున్న దిల్ రాజు..!

లైగర్ ప్లాప్ అయిన ధైర్యం చేస్తున్న దిల్ రాజు..!

by Azhar
Ad

విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా అనేది మొత్తం డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతలను భారీ నష్టాలూ అనేది మిగిల్చింది లైగర్ సినిమా. అయితే ఈ సినిమా ఇచ్చిన ప్లాప్ వల్ల విజయ్ దేవరకొండకు కూడా కొంతమేర నష్టం అనేది జరిగింది అనే చెప్పాలి. ఆయనపై ఎక్కువ ఖర్చు చేసేందుకు నిర్మాతలు వెన్నకి తగ్గుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

కానీ ఈ సినిమాలో కూడా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం విజయ్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు అని సమాచారం. ఇప్పటికే విజయ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట దిల్ రాజు. అలాగే తన దగ్గర ఉండే దర్శకులకు అందరికి కూడా విజయ్ దేవరకొండ కోసం మంచి కథ అనేది సిద్ధం చేయాలనీ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా అనేది ఇప్పుడప్పుడే ప్రారంభం కాదు అని తెలుస్తుంది.

Advertisement

ఎందుకంటే ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వం లో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ లైగర్ దర్శకుడు అయిన పూరి జగన్నాథ్ తో జనగణమన అనే సినిమా చేస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా కూడా విజయ్ పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి ఈ సినిమాలు అన్ని పూర్తి కావడానికి కనీసం మూడేళ్లయినా పడుతుంది. కాబట్టి ఆ తర్వాత దిల్ రాజుతో విజయ్ సినిమా చేయనున్నట్లు అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ స్థానానికి సూర్య కుమార్ ఎసరు..?

తనపై వస్తున్న పుకార్ల మీద జడేజా స్పందన..!

Visitors Are Also Reading