Home » ఆ సినిమాలో షారుక్ ఖాన్, నాగార్జున పాత్రలు లీకయ్యాయా.. వారి రోల్ ఇదేనా..?

ఆ సినిమాలో షారుక్ ఖాన్, నాగార్జున పాత్రలు లీకయ్యాయా.. వారి రోల్ ఇదేనా..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో అభిమానం,గౌరవం, లక్షలాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయన నాగార్జున అని చెప్పవచ్చు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా షారుక్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఇద్దరి స్టార్లు ఒక భారీ బడ్జెట్ తో రానున్న బ్రహ్మాస్త్ర మూవీలో నటించబోయే పాత్ర ఏమిటో తెలిసిపోయింది. మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

ఇందులో ప్రముఖ పాత్రలో బాలీవుడ్ యాక్టర్లు రన్బీర్ కపూర్, అమితాబచ్చన్, ఆలియా భట్, మౌని రాయ్, షారుక్ టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాగార్జున మరియు షారుక్ కనిపించబోయే పాత్రలు బయటకు వచ్చాయి. నాగార్జున ఆర్కియాలజిస్టు గా కనిపించనున్నారని, షారుక్ సైంటిస్ట్ గా కనిపించనున్నారని, వీరిద్దరూ కలిసి బ్రహ్మాస్త్రాన్ని కనుగొనే అన్వేషణలో రన్బీర్ కపూర్, నాగార్జున, షారుక్ ఖాన్ సంప్రదిస్తారట.

Advertisement

అయితే బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ ట్రైలర్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించిన విషయం అందరికీ తెలిసిందే. మూడు పార్టులుగా రాబోతున్న ఈ మూవీ తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళం భాషలలో విడుదలకానుంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ధర్మా పొడక్షన్, స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై రన్బీర్ కపూర్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, నమిత్ మల్హోత్రా, అపూర్వ మెహత కలిసి నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఎలాంటి రికార్డు నమోదు చేస్తుందో వేచి చూడాలి.

also read;

సౌందర్య మరణం తరువాత భర్త పరిస్థితి అంత దారుణంగా ఉందా ? ఎలా ఉన్నారంటే ?

మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినా రాజమౌళి ఎందుకు హర్ట్ అయ్యాడు ? అల్లు అరవింద్ అలా చేశాడా ?

 

Visitors Are Also Reading