Home » ఆర్జే సూర్య అంతటి కష్టాలను అనుభవించారా ?

ఆర్జే సూర్య అంతటి కష్టాలను అనుభవించారా ?

by Anji
Ad

ప్రస్తుతం సెలబ్రిటీలుగా తమ కెరీర్ ను కొనసాగిస్తున్న ఎంతోమంది నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. బిగ్ బాస్ షో సీజన్ 6 కంటెస్టెంట్లలో ఆర్జే సూర్య కూడా ఒకరు. అయితే తిండి కూడా లేని దీని పరిస్థితులను ఆర్జే సూర్య ఎదుర్కొన్నారని సమాచారం. ఆర్జే సూర్య పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. గుంటూరు టాకీస్, గరుడవేగ సినిమాల్లో నటించారు. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న ప్రోగ్రామ్ ద్వారా కూడా ఆర్జే సూర్య మంచి పేరును సంపాదించుకున్నారు.

Advertisement

ఆర్జే సూర్యది తూర్పుగోదావరి జిల్లాలోని పసుపులంక. ఇతని తల్లిదండ్రులు కూలి పని చేసే వారని తెలుస్తోంది. బాల్యంలో డబ్బుల కోసం సూర్య సోడా సీసాలు కడిగేవాడని అలా పని చేయడం ద్వారా వచ్చిన డబ్బును ఖర్చులకు వినియోగించుకునే వాడని సమాచారం.పీజీ చదివిన సూర్య ప్రముఖుల వాయిస్ లను మిమిక్రీ చేయడానికి ఎంతగానో ఇష్టపడేవారు. మిమిక్రీ చేయడం ద్వారా సూర్య ప్రశంసలతో పాటు మెడల్స్ ను కూడా సొంతం చేసుకున్నారు. చిన్నప్పుడు సరిగ్గా తిండి కూడా తినలేని పరిస్థితులు అనుభవించిన సూర్య ఇప్పుడు మాత్రం తన ప్రతిభతో కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్నారు. బిగ్ బాస్ షో కోసం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Advertisement

Also Read :  మోకాళ్ళ పై తిరుపతి మెట్లు ఎక్కిన ఆ హీరోయిన్

బిగ్ బాస్ షో టాప్ 5లో సూర్య కూడా ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో సీజన్ 6 పై అంతో ఇంతో ఆసక్తి కలగడానికి కారణం అయిన కంటెస్టెంట్లలో సూర్య కూడా ఒకరనే సంగతి తెలిసిందే. సూర్య కెరీర్ పరంగా మంచి సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో తర్వాత సూర్య కు సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ పక్కాగా ఉందని టాక్ వినిపిస్తోంది. ముందు ముందు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.

Also Read :  నయనతార సరోగసి కేసులో అడ్డంగా దొరికిన డాక్టర్

Visitors Are Also Reading