Home » రాజమౌళి వాళ్ల వదిన చెప్పిన ఆ ఒక్క మాటతోనే టాప్ డైరెక్టర్ అయ్యాడా..?

రాజమౌళి వాళ్ల వదిన చెప్పిన ఆ ఒక్క మాటతోనే టాప్ డైరెక్టర్ అయ్యాడా..?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. స్టూడెంట్ నెం.1 సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని మంచి సక్సెస్ సాధించాయి. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగాడు. ముఖ్యంగా బాహుబలి సిరీస్, RRR సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వాస్తవానికి రాజమౌళి ఇంత పెద్ద దర్శకుడు అవ్వడానికి గల కారణం ఏంటి..? అని ప్రతీ ఒక్కరికీ తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది.

rajamouli

Advertisement

రాజమౌళి వారి ఫ్యామిలీ తొలుత కర్ణాటకలో ఉండేవారు. అక్కడ వాళ్లకు దాదాపు 350 ఎకరాల భూమి ఉండేది. కానీ వాళ్లు చేస్తున్న బిజినెస్ లో నష్టాలు రావడంతో భూమి మొత్తాన్ని అమ్మేసి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ కాలం గడిపేవాడట. విజయేంద్ర ప్రసాద్, వాళ్ల అన్నయ్య శివశక్తి దత్త ఇద్దరూ కలిసి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. వీళ్ల ఫ్యామిలీ లో ఉన్న 13 మంది ఒకే సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉండేవారు. అప్పట్లో రాజమౌళి ఏ పని లేకుండా 20 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా తిరుగుతూనే ఉండేవాడట. రాజమౌళి ఏం చేస్తున్నాడు.. ఇలా అయితే కష్టం అనుకుంటూ ఉండేవారట.

Advertisement

 

ఒకరోజు కీరవాణి వాళ్ల వైఫ్ అయిన వల్లి గారు రాజమౌళిని పిలిచి ఆయనతో మాట్లాడి ఊరికే తిరిగితే నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏదైనా ఓ లక్ష్యం పెట్టుకొని దానిని సాధించే ప్రయత్నం చెప్పిందట. అప్పుడు రాజమౌళి ఎడిటింగ్ వర్క్ నేర్చుకోవడమే కాకుండా వాళ్ల నాన్న విజయేంద్ర ప్రసాద్ వద్ద కొన్ని సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా కూడా జాయిన్ అయ్యాడు. ఆ తరువాత రాఘవేంద్ర రావు దగ్గర కొన్నిసినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తరువాత శాంతినివాసం అనే సీరియల్ తీసి మంచి సక్సెస్ సాధించాడు. ఇక ఆ తరువాత స్టూడెంట్ నెం.1 సినిమాని తెరకెక్కించాడు. మొత్తానికి రాజమౌళి దర్శకుడు కావడానికి వాళ్ల వదిన అయిన వల్లి గారు హెల్ప్ చేశారనే చెప్పవచ్చు. అందుకే ఇప్పటికీ వల్లి గారు అంటే రాజమౌళికి వాళ్ల అమ్మతో సమానం అని పలు సందర్భాల్లో చెబుతుంటాడు.

Also Read :  అట్టర్ ఫ్లాప్ టాక్ తో బ్లాక్ బస్టర్ సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇదేనా ? మహేష్ స్టామినా అదేనంటూ

Visitors Are Also Reading