Home » లక్ష్మీ పార్వతి కంటే ముందే ఆ హీరోయిన్ ని ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? ఏమైందంటే..?

లక్ష్మీ పార్వతి కంటే ముందే ఆ హీరోయిన్ ని ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? ఏమైందంటే..?

by Anji
Ad

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆంధ్రులు ఎంతలా కొలుస్తారో అందరికీ తెలిసిందే. అప్పట్లో తిరుపతికి వెళ్లిన వారు రామారావును చూడకుండా వస్తే.. దర్శనం పూర్తి కానట్టే అని ప్రచారం జరిగేది. ఆయనను అంతలా అభిమానించే వారు అభిమానులు. అందరికీ తెలిసినంత వరకు ఎన్టీఆర్ కి రెండో పెళ్లి లక్ష్మిపార్వతితో అయిందనుకుంటారు. కానీ ఈమె కంటే ముందు ఎన్టీఆర్ మరో అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారట.

Advertisement

అప్పట్లో ఎన్టీఆర్ సినిమాల పరంగా స్టార్ స్టేటస్ లో ఉన్న సమయంలోనే హీరోయిన్లు ఆయనకు కాల్షీట్లు ఇచ్చేవారు కాదట. నిజానికి చాలా మంది హీరోయిన్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ప్రమోట్ చేశారు ఎన్టీఆర్. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ హీరోయిన్లందరినీ ఏఎన్నార్ సంవత్సరాల కొద్ది కాల్షీట్లు తీసుకునేవాడట. దీంతో ఎన్టీఆర్ కి హీరోయిన్ల కొరత ఏర్పడేది. దీంతో ఆయన కృష్ణకుమారి అనే హీరోయిన్ ని తీసుకొచ్చారు. ఆమె చాలా ప్లెక్సిబుల్ గా ఉండేదట. అప్పట్లో ఎన్టీఆర్ ఎక్కువగా ఆమెతోనే సినిమాలను చేసేవారట. ఈమె కేవలం ఎన్టీఆర్ తోనే ఎక్కువగా నటించేది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. ఆమె గుణం ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ భార్య బసవతారకం బాలింతగా ఉన్నారు.

Advertisement

మెంటల్ ప్రెజర్ తగ్గించుకునేందుకు  కృష్ణకుమారితో సహజీవనం చేయాలనుకున్నారట ఎన్టీఆర్. ఈ విషయం భార్య బసవతారకంకు తెలియడంతో ఆమె కూడా అడ్డు చెప్పలేదట. కృష్ణకుమారి కూడా ఒప్పుకోవడంతో వీరిద్దరూ ఒక్కటవ్వాలని భావించారు. ఇక ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన చిన్నాయనకు చెప్పారు.  విజయవాడలో ఉంటున్న చిన్నాయన త్రివిక్రమరావు ఎన్టీఆర్ కి తాను వచ్చే వరకు ఏమి చేయవద్దని చెప్పాడట.  నేరుగా బైకు వేసుకొని కృష్ణకుమారి ఇంటికి వెళ్లి.. తుపాకితో ఆమెను బెదిరించారట. ఆంధ్రులందరూ రాముడిలా భావించే ఎన్టీఆర్ తో రెండో పెళ్లి అంటే అందరూ ఏమనుకుంటారు అని ప్రశ్నించారు. ఆయన కంటికి కనిపించనంత దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆమె భయపడి బెంగళూరుకి వెళ్లిపోయిందట.  ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన చిన్నాయన ఇప్పటికే 11 మంది పిల్లలు ఉన్న నీకు మళ్లీ పెళ్లి ఏంటి అని సర్ది చెప్పారు. కానీ కృష్ణకుమారి ఏమనుకుంటుందో అని ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

Srileela: అల్లు అర్జున్ సినిమాకు “నో” చెప్పిన శ్రీలీల.. కారణం ఏంటంటే?

Visitors Are Also Reading