తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాత నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు కాదు కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ అయ్యారు జూనియర్ తారక రామారావు.. అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఇంతటి స్థాయికి రావడానికి అనేక కష్టాలు పడ్డారు. ఆయన ఓ స్థాయికి వచ్చిన తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనను యాక్సెప్ట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.
Advertisement
కట్ చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు.. అయితే ఆమెను పెళ్లి చేసుకునే దానికంటే ముందే ఆయన ఆ హీరోయిన్ తో ఘాటుగా ప్రేమలో పడ్డారట.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఎన్టీఆర్ అశోక్,నరసింహుడు సినిమాల్లో ఆయన సరసన హీరోయిన్ గా చేసిన సమీరా రెడ్డి తో ప్రేమలో పడ్డారని అనేక వార్తలు వినిపించాయి. వీరు ఆ సినిమా చేసే టైంలో పిచ్చపిచ్చగా లవ్ చేసుకున్నారని, కానీ వారిద్దరి మధ్య ఒక్కటే విడిపోవడానికి కారణమైందట. సమీరా రెడ్డి వేరే చిత్రాల్లో నటిస్తూ ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చేది కాదట.
Advertisement
ఇక ఇదే కారణంతో జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డికి ఓ కండిషన్ పెట్టారట. నువ్వు నా చిత్రాల్లో తప్ప వేరే సినిమాల్లో నటించకూడదని అన్నారట. దీంతో ఆమె కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కి తెలియడంతో సైలెంట్ గా సమీరారెడ్డి కుటుంబం దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారట. హైదరాబాద్ వదిలి వెళ్లకుంటే మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు అంటూ గట్టిగా అరిచారట. దీంతో వారి ఫ్యామిలీ హైదరాబాద్ వదిలి వెళ్లిందని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మొహం కూడా చూడలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె దూరమైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారని కొంతమంది సినీ విశ్లేషకులు అంటున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- పవిత్ర పిల్లల్ని కంటే తప్పేముంది అంటున్న నరేష్..!!
- బిస్లరీ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?
- షర్మిల-డీకేల మధ్య ఢీల్ కుదిరిందా.. కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే..?