స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. పలు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాజ్యం ఏలుతున్న ఈబ్యూటీ.. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి నెంబర్ ని రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది. అంతేకాదు.. లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది నయనతార.
Advertisement
నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైనా ఇట్టే లీనమైపోయే ఈ అమ్ముడు గత కొంతకాలంగా ప్రేమించిన దర్శకుడు విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. జూన్ 09న తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ రెస్టారెంట్ లో చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యనే విఘ్నేష్ తో మూడు ముళ్లు వేయించుకుంది. అయితే విఘ్నేష్ ప్రేమాయణానికి ముందు నయనతార కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. నయనతార వల్లనే ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చాడని కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. ఇక ఆ సమయంలో ప్రభుదేవా భార్య రమలత్ నయన్ కి శాపనార్థాలు కూడా పెట్టింది.
Advertisement
ఇక తరువాత నయనతార, ప్రభుదేవా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రభుదేవా.. నయనతార బ్రేకప్ చెప్పుకోవడానికి ప్రభుదేవా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని తెలుస్తోంది. పెళ్లి తరువాత ప్రభుదేవా సినిమాలు వద్దని చెప్పడంతోనే నయన్ ఓకే అని చెప్పిందట. ప్రభుదేవా క్రిస్టియన్ గా ఉన్న నయన్ ని తన మంతలోకి మారాలని కోరగా అదికూడా సరే అని చెప్పిందట. నయనతార ఆస్తులను కొన్నింటిని ప్రభుదేవా పేరుపై ట్రాన్స్ ఫర్ చేసిందట. ఇక ఆ తరువాత ప్రభుదేవా ఆదిపత్యంతో మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాడట. అలాగే ప్రభుదేవా తీరులో మార్పు కనిపించడంతో విసిగిపోయిన నయనతార చివరకు బ్రేకప్ చెప్పేసిందట. ప్రభుదేవాకు బ్రేకప్ చెప్పిన నయన్ ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఏరికోరి చేసుకున్న విఘ్నేష్ తో నయన్ ప్యూచర్ ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
విడాకుల కోసం మెగా డాటర్ నిహారిక దరఖాస్తు ?