Home » Bigboss6 : నారాయణపై నాగార్జున సెటైర్ వేశారా..? మరీ అలా అనేశాడెంటబ్బా..!!

Bigboss6 : నారాయణపై నాగార్జున సెటైర్ వేశారా..? మరీ అలా అనేశాడెంటబ్బా..!!

by Sravanthi
Ad

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రారంభమై రెండు వారాలు దగ్గరికి వస్తోంది.. ఈ తరుణంలో షో ఎంత విజయవంతంగా ముందుకు వెళ్తుందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను టార్గెట్ చేస్తూ చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ నాగార్జున వీటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ తరుణంలో షో మొదలైనప్పటినుంచి సిపిఐ నాయకుడు నారాయణ సీరియస్ అవుతూనే ఉంటున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ షోపై నాగార్జునపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు నారాయణ..

Advertisement

ALSO READ:నటి జమునను టాలీవుడ్ నుంచి 3ఏళ్ళు నిషేధించారు.. కారణం తెలిస్తే షాకవుతారు..!!

ఇది బిగ్బాస్ హౌస్ కాదని బ్రోతల్ హౌస్ అని, కేవలం డబ్బు కోసమే వీరంతా పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు.. కానీ దీనిపై ఏనాడు నాగార్జున ప్రత్యక్షంగా మాత్రం స్పందించలేదు. కానీ శనివారం జరిగిన ఒక ఎపిసోడ్ లో ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ లతో మాట్లాడుతూ.. హౌస్ లో ఉన్న భార్య,భర్తలు మెరీనా రోహిత్ లు హాగ్ చేసుకోవాలని అడిగారు. వాళ్ళ హాగ్ చేసుకొని ముద్దుఇవ్వగానే నాగార్జున నవ్వుతూ ” నారాయణ నారాయణ వాళ్లు పెళ్లైన వాళ్ళు అని అన్నారు.. ఈ మాటలను పట్టుకున్నా నెటిజన్స్ నాగార్జున నారాయణపై సెటైర్లు వేశారు అని వార్తలు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్నాయి. కానీ దీనిపై నాగార్జున కూడా స్పందించారు..

Advertisement

 

తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఎవరైనా జోకులు వేస్తే నారాయణ నారాయణ అంటూ ఉంటాను.. శనివారం జరిగిన ఎపిసోడ్ లో అందరినీ నవ్వించడానికి అలా అన్నాను. నేను ఎవరిని ఉద్దేశించి నారాయణ నారాయణ అని అనలేదని చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ లో ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు గేమ్స్ ఆడుతున్నారు ఎవరు డ్రామా చేస్తున్నారు అనేది విశ్లేషించుకుంటే నాకు లైఫ్ లైసెన్సులా అనిపిస్తోంది. మన కుటుంబాన్ని మన దగ్గరి వాళ్లను వదిలేసి వందలాది కెమెరాల మధ్య కొత్తకొత్త వ్యక్తుల మధ్య సమయం గడపడం అనేది చిన్న విషయం కాదు. ఒకవేళ నేను పాటిస్పేట్ గా ఛాన్స్ వస్తే బిగ్ బాస్ లోకి వెళ్లాలి అనుకోవడం లేదని అన్నారు.

ALSO READ:

Visitors Are Also Reading