సినిమాల ద్వారా ఇండస్ట్రీలో, జనాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న నట సార్వభౌమ నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగారు.. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకానొక సమయంలో ప్రళయం సృష్టించిందని చెప్పవచ్చు. అలాంటి అన్న ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు.. సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ ఎన్టీఆర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పలుమార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశారు.. తన కూతురును చంద్రబాబుకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత టిడిపి పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయాయి..
Advertisement
ALSO READ:పొన్నియిన్ సెల్వన్ లో త్రిష ధరించిన నగల చరిత్ర గురించి మీకు తెలుసా ?
ఆ తర్వాత ఎన్టీఆర్ మరణానంతరం నుండి లక్ష్మీపార్వతి చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తోంది. తన భర్తకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని, టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని పలుమార్లు అన్నారు.. ఆమె చాలా ప్రెస్మీట్లలో చంద్రబాబును ప్రస్తావిస్తు మోసగాడిగా చిత్రీకరించారు.. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ నాయకులు కూడా లక్ష్మీపార్వతికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా చాలాసార్లు లేవనెత్తారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, లక్ష్మీపార్వతిని గాలికి వదిలేశారు అంటూ, ఆమెకు అండగా నిలుస్తామని హామీలు కూడా ఇచ్చారు. ఈ విధంగా లక్ష్మీపార్వతి ఎప్పుడు మాట్లాడేది చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విషయం తప్ప మరొకటి ఉండదని, దీన్ని ప్రతిపక్షాలు కూడా బేస్ చేసుకుంటున్నారని సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ అన్నారు.
Advertisement
ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీ పార్వతి సంపాదించింది కానీ, సాధించింది గాని ఏమీ లేదని చెప్పవచ్చు. ఆమె ఒక శూన్యమైన మహిళగా ఉందని అన్నారు. ఆ రోజుల్లో ఆయన దగ్గర ఉన్న కొన్ని ఆస్తులను దేవినేని నెహ్రూ, కొన్నింటిని మోహన్ బాబు తీసుకెళ్లాడని మొదటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ దేవినేని నెహ్రూను టిడిపిలోకి రానివ్వకపోవడం ప్రధాన కారణం ఇదే అని అంటారు. ఇన్ని వివాదాల నడుమ లక్ష్మీపార్వతి చాలా బలంగా వైఎస్ఆర్సిపి వైపు నిలబడటానికి కారణం తెలుగుదేశం పార్టీ అంటే ఆమెకు ఉన్న భయం, అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అన్నా కూడా చాలా భయం. ఈ భయంలో నుంచి బయటపడాలంటే వైఎస్ఆర్సిపి వైపు బలంగా మాట్లాడుతూ వస్తోందని జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు..
ALSO READ:నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..? అయితే మూడింటిని అస్సలు తీసుకోవద్దు..!