భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందే ప్లాప్ టాక్ రావడం.. విడుదలయ్యాక సినిమా డిజాస్టర్ అవ్వడం అంతా అలా జరిగిపోయింది. అయితే చిరంజీవిది ఒకటి రెండు సినిమాలు కాదు. ఏకంగా 150కిపైగా సినిమాల అనుభవం. చిరుకంటూ ఓ జడ్జ్‌మెంట్ ఉంటుంది. ఈ తరుణంలో ఆచార్య విషయంలో సినిమా ఫలితం ఆయనకు ముందే అర్థమైపోయిందట.
Advertisement
కొన్ని సందర్భాల్లో దర్శకుడు కొరటాల శివను ప్రశ్నించారట. కథలో మార్పులు, కొరటాల టేకింగ్ పట్ల ఎక్కడో తేడా కొట్టేసింది అని అడగ్గా కొరటాల మనం అంతా కరెక్ట్‌గానే చేస్తున్నాం సార్.. ప్రస్తుత జనరేషన్ ఇలాగే ఉంటుందని చెప్పేవారట. చిరంజీవి ప్రతి దానికి డౌట్లు పెడుతున్నారని పక్కన ఉన్న వారితో అనేవారట. నిర్మాత నిరంజన్‌రెడ్డి రామ్‌చరణ్‌తో చెప్పడంతో నాన్న అంతా ఆయన మీదే వదిలేద్దాం. ఆయన ఏవిదంగా చెబితే అలా చేద్దామని.. రామ్ చరణ్ కూడా చిరంజీవిని కన్విన్స్ చేసి బ్యాలెన్సింగ్‌తో షూటింగ్ పూర్తి చేయించారట. అదేవిధంగా కొరటాల ముందు రూ.100 కోట్లు ఇవ్వండి.. ఈ బడ్జెట్‌తోనే సినిమా పూర్తి చేద్దామని నిర్మాతతో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
Advertisement
కరోనా కారణంగా వడ్డీ రూ.50కోట్లు పెరిగిపోవడంతో కొరటాల టెన్షన్‌లో పడి కథ, కథనాలపై పూర్తిగా దృష్టి సారించలేదని టాక్ కూడా వినిపిస్తుంది. రాజమౌళి మాదిరిగా కొరటాల కూడా అన్ని ఏరియాలకు బిజినెస్ డీటైల్స్ మాట్లాడేసుకోవడం.. ఆ డిస్ట్రిబ్యూటర్లు తాము ముందు అనుకున్న అమౌంట్ చెల్లించలేము అని చెప్పడంతో చివరికి విడుదలకు ముందు రోజు చిరు తన రెమ్యునరేషన్ రూ.10కోట్లు వదులుకొని మరీ సినిమా విడుదల చేయాలని చెప్పారట. వాస్తవానికి కొరటాలకు మహేష్ శ్రీమంతుడు సినిమా నుండి బిజినెస్‌లో కూడా వేలు పెట్టడం అలవాటు అయిపోయిందట.
అలా ఎవరైనా అడిగితే.. రాజమౌళితో పోల్చి చెప్పేఆడట. కొరటాల కూడా ఇప్పటి వరకు అన్ని హిట్ సినిమాలు తీసిన దర్శకుడిగా పేరుంది. అయితే ఆచార్యతో కూడా రాజమౌళి అవతారం ఎత్తాలని చూసి ఆతృతతో బోర్లాపడ్డాడు. మెగాస్టార్ తొలుత నుంచి అనుకున్నట్టే సినిమా తేడాగానే ఉంది. ముఖ్యంగా రామ్‌చరణ్ రోల్‌ను ప్లానింగ్ లేకుండా పెంచడం సినిమాకు పని చేస్తున్న కొందరు చరణ్-చిరు కలిసి డ్యాన్స్ చేస్తే కదా..? ప‌్రేక్షకులు చూస్తారని చెప్పడంతో మళ్లీ వీరి కాంబినేషన్‌లో పాటలు కలపడం.. తొలుత అనుకున్న కాజల్‌ను తీసేయడం.. ఇలా ఆచార్య సినిమా ప్లాప్‌నకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా ఫలితం ఈ విధంగా ఉంటుందని చిరంజీవి ముందుగానే ఊహించారని తెలుస్తోంది.
Also Read :
మంత్రి రోజాకు తెలుగు సినీ పరిశ్రమ సన్మానం చేయాలంటున్న బండ్ల గణేష్
మంచు లక్ష్మి స్టెప్పులు..ఆచార్య పోయినందుకా అంటూ నెటిజన్ల కామెంట్స్..!