Home » జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అవుతాడని చిరంజీవి ముందే చెప్పాడా..?

జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అవుతాడని చిరంజీవి ముందే చెప్పాడా..?

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా హీరోగా కూడా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకమనే చెప్పాలి.

Advertisement

ఇక ఆ తరువాత చేసిన మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ చిన్నతనంలోనే బాల రామాయణం అనే మూవీ చేశాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా తరువాత చిరంజీవికి కథ చెప్పడానికి వెళ్లిన గుణశేఖర్ తను ఇంతకు ముందు చేసిన బాలరామాయణం సినిమాను చూసిన చిరంజీవి.. రాముడి పాత్రను పోషించిన అబ్బాయి కెరీర్ లో స్టార్ హీరో అవుతాడనే చెప్పాడట. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.

Advertisement

ఎన్టీఆర్ స్టార్ హీరో అవుతాడని మెగాస్టార్ చిరంజీవి చెప్పడానికి కారణం ఏంటంటే..? పర్పామెన్స్ లో ఆ డెప్త్ అనేది తెలిసిపోతుంది. అందుకే చిరంజీవి ఆ రోజు ఆ మాట చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మొత్తానికి చిరంజీవి నందమూరి స్టార్ హీరో గురించి అలా చెప్పడం అనేది సూపర్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తుండగా.. చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :  చిరంజీవితో సినిమా చేయాలనుకొని.. ఇప్పటికీ చేయని దర్శకులు వీరే..!

 

Visitors Are Also Reading