సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు రికార్డులను క్రియేట్ చేయడం.. మళ్లీ ఆ రికార్డులను మరో హీరోనే లేదా అదే హీరోనో బ్రేకు చేయడం సర్వసాధారణం. దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎంతో మంది స్టార్ హీరోలు ఎన్నో రికార్డులు సృష్టించారు. రికార్డులు ఎప్పటికప్పుడు సరికొత్తగా మారుతుంటాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ కొందరూ హీరోల పైరుపై మాత్రమే ఉంటాయి. ఎంత మంది హీరోలు వచ్చినా కొన్ని రికార్డులను మాత్రం టచ్ చేసే అవకాశముండదు.
Also Read : దర్శకుడి మాటలు వినక అట్టర్ ప్లాప్ అయినా మెగా స్టార్ సినిమా ఏది ? ఎందుకు చిరు వినిపించుకోలేదు ?
Advertisement
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వంశానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మూడు తరాలకు చెందిన హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక వీరిలో నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖం, వీరసింహారెడ్డి సినిమాలు సూపర్ హిట్ సాధించడంతో మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. ప్రధానంగా బాలయ్య నటించిన అఖండ చిత్రం 103 కేంద్రాల్లో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా ఏకంగా స్వర్ణోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఎన్నో చెదిరిపోని రికార్డులను క్రియేట్ చేసింది. తొలి డబుల్ సెంచరీ సినిమాగా తెలుగులో ఎన్టీఆర్ నటించిన పాతాళబైరవి రికార్డు సృష్టించింది.
Advertisement
Also Read : “సమరసింహారెడ్డి”లో నటించిన ఈ అమ్మాయికి రామ్ చరణ్ కి మధ్య ఇలాంటి రిలేషన్ ఉందా..?
పాతాళ బైరవి తరువాత లవకుశ చిత్రం థియేటర్లలో ఏకంగా 60 వారాల పాటు ఆడిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో సెకండ్ రిలీజ్ తో కలుపుకొని 62 కేంద్రాల్లో సెంచరీ సాధించింది లవకుశ చిత్రం. నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన లెజెండ్ చిత్రం కర్నూల్ జిల్లాలోని ఓ థియేటర్ లో 1005 రోజులు ప్రదర్శితమై తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ భారతదేశంలోనే ఇది పెద్ద రికార్డు అనే చెప్పాలి. అప్పట్లో ఎన్టీఆర్ పేరిట ఎన్నో రికార్డులుంటే.. ఇప్పటి తరంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ రికార్డులను చెక్కుచెదరకుండా తన పేరిట లిఖించుకున్నాడు. రికార్డులలో తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకున్నాడు బాలయ్య. టాలీవుడ్ లో ఇంత మంది యువ హీరోలు, సీనియర్ హీరోలు ఉన్నప్పటికీ బాలయ్య ఇలా రికార్డు క్రియేట్ చేయడం హర్షించదగ్గ విషయమనే చెప్పాలి.
Also Read : NTR అడవిరాముడు షూటింగ్ విశేషాలు. షూటింగ్ లో జరిగిన ప్రమాదం నుండి బయటపడిన హీరోయిన్స్!