Home » ఆ డైరెక్టర్ తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ మ్యారెజ్.. కోర్టులో నిజం చెప్పేసిన దర్శకుడు..!

ఆ డైరెక్టర్ తో ధన్య బాలకృష్ణ సీక్రెట్ మ్యారెజ్.. కోర్టులో నిజం చెప్పేసిన దర్శకుడు..!

by Bunty

టాలీవుడ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధన్య బాలకృష్ణ బెంగళూరులో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. ధన్య సూర్య, శృతిహాసన్ నటించిన 7ఆమ్ అరివు తెలుగులో 7th సెన్స్ వచ్చిన సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఆమె 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కూడా కనిపించింది.

కాగా ఈ భామ తమిళ స్టార్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ని రహస్య వివాహం చేసుకుంది అన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గతంలో ఈ విషయాన్ని టాలీవుడ్ లోని మరో నటి కల్పిక గణేష్ తన యూట్యూబ్ ద్వారా బయటపెట్టింది. ఇప్పుడు ఈ విషయాన్ని దర్శకుడు బాలాజీ ధ్రువీకరించాడు. వీరిద్దరూ 2020 జనవరిలోనే వివాహం చేసుకున్నట్లు వెల్లడించాడు.

నటి కల్పిక, ఆమె యూట్యూబ్ ఛానల్ లో తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కోర్టులో ఫిర్యాదు చేసిన బాలాజీ, ధన్యతో వివాహాన్ని కూడా బయటపెట్టారు. అయితే ఈ దర్శకుడికి ఇది రెండో వివాహం. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ దర్శకుడు, ధనుష్ మారి-1, మారి-2 సినిమాలను తెరకెక్కించాడు. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన మొదటి మూవీ ‘లవ్ ఫెయిల్యూర్’ ధన్య బాలకృష్ణకి రెండో సినిమా. వీరిద్దరికీ ఆ సమయంలోనే పరిచయమైనట్లు తెలుస్తుంది.

read also : కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తెలంగాణ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ !

Visitors Are Also Reading