“ఏసుక్రీస్తు కృప వల్లనే కరోనా మహమ్మారి అంతమయ్యింది. వైద్యులు, మెడిసిన్ వల్ల కాదు” అంటూ గతేడాది డిసెంబర్ లో వివాదాస్పద వాక్యాలు చేసిన తెలంగాణ డిహెచ్ శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు శ్రీనివాసరావు.
READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !
Advertisement
మొత్తానికి పొలిటికల్ ఎంట్రీ కోసం శ్రీనివాస్ తహతహలాడుతున్నట్టు క్లియర్ కట్ గా స్పష్టం అవుతుంది. డిహెచ్ ఎలాంటి కామెంట్ చేసిన వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఆ మధ్య కొత్తగూడెంలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తానన్నారు. అక్కడితో ఆగకుండా కొత్తగూడెం నుంచి చాలామంది తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొత్తగూడెంకు తిరిగి ఇచ్చేయాలి.
Advertisement
read also : Sir Movie : సార్ మూవీ ఓటింగ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
లేకపోతే ఇచ్చేలా చేద్దామంటూ శ్రీమంతుడు సినిమా డైలాగ్ వదిలి హాట్ టాపిక్ గా నిలిచారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ డీహెచ్ స్వామి భక్తిని చాటుకున్నారు. అప్పట్లో సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. పైగా సమర్ధించుకున్నారు కూడా. ఒక్కసారి కాదు వంద సార్లైనా బరాబర్ మొక్కుతానని వినయ విధేయ ప్రదర్శించారు. నిజానికి జలగం – వనమా గ్రూపులుగా విడిపోయిన కొత్తగూడెంలో ఎలాగైనా బరిలో నిలవాలని భావిస్తున్నారు శ్రీనివాస్.
READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్