Home » టాలీవుడ్ నటి హేమ భర్త గురించి తెలుసా? ఈయన కూడా సినిమా ఇండస్ట్రీ లోనే పని చేస్తున్నారని తెలుసా?

టాలీవుడ్ నటి హేమ భర్త గురించి తెలుసా? ఈయన కూడా సినిమా ఇండస్ట్రీ లోనే పని చేస్తున్నారని తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న నటి హేమ గురించి తెలియని వారుండరు. ఎన్నో సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి పేరు తెచ్చుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా జరిగిన మా ఎన్నికల్లో నటి హేమ శివ బాలాజీ చెయ్యిని కొరికి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా.. నటి హేమ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉంటె.. నటి హేమ భర్త ఎవరు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు.

Advertisement

ఆమె భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే అన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. చాలా సినిమాల్లో నటి హేమ అక్క, వదిన, పిన్ని, అత్తా పాత్రలు పోషిస్తూ ఎం అంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. నటి హేమ దాదాపు నాలుగొందలకు పైగా సినిమాల్లో నటించారు. అంత మంచి గుర్తింపు తెచ్చుకుని.. అంత సక్సెస్ సాధించడం అనేది మాములు విషయం ఏమీ కాదు. అందుకు ఆమె భర్త ప్రోత్సాహం కూడా ఉంది.

Advertisement

Do you know these things about actress Hema's husband

నటి హేమ భర్త స‌య్య‌ద్ జాన్ అహ్మ‌ద్. ఈయన సినిమా పరిశ్రమ లోనే క్యామెరామెన్ గా పని చేస్తున్నారు. క్యామెరా మెన్ గా ఈయన మంచి సంపాదించుకున్నారు కూడా. జాన్ అహ్మద్ తండ్రి జాన్ ఎస్‌డీ లాల్‌. జాన్ అహ్మద్ నటి హేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. వీరిద్దరి ప్రేమకి గుర్తుగా వీరికి ఒక కుమార్తె కూడా ఉందట. ఆయన తన భార్య హేమను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటారట. అందుకే ఆమె అంత స్థానానికి చేరుకుందని చెప్పవచ్చు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading