Home » నిండు గ‌ర్భిణీ అయిన‌ప్ప‌టికీ ఒలింపియాడ్ బ‌రిలో హారిక‌

నిండు గ‌ర్భిణీ అయిన‌ప్ప‌టికీ ఒలింపియాడ్ బ‌రిలో హారిక‌

by Anji
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా చెస్ క్రీడ‌కు ఎంత ప్రాధాన్య‌త ఉందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పురాతన కాలం నుంచే చెస్ ఆడేవారు. ప్ర‌తి సంవ‌త్స‌రం చెస్ ఒలంపియాడ్ నిర్వ‌హిస్తుంటారు. క‌రోనా కార‌ణంగా 2020, 2021లో ఆన్‌లైన్ ఒలంపియాడ్ నిర్వ‌హించారు. 2018లో చివ‌రిసారిగా ప్ర‌త్యక్షంగా చెస్ ఒలంపియాడ్ నిర్వ‌హించారు. ఈ టోర్నీలో ప్ర‌త్యేకమైన విష‌యం ఏమిటం టే నిండు గ‌ర్భిణిగా ఉన్న ద్రోణ‌వ‌ల్లి హారిక టోర్నీలో ఆడ‌డం విశేషం.


తాజాగా హారిక మీడియాతో ముచ్చ‌టించారు. ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హించే చెస్ ఒలంపియాడ్ మాకు ఐదు సంవ‌త్స‌రాల‌కొక‌సారి నిర్వ‌హించే ఒలింపిక్స్ స‌మానం. నేను నిండు గ‌ర్భిణిగా ఉన్న‌ప్ప‌టికీ ఈ టోర్నీలో ఆడాల‌ని నిశ్ఛ‌యించుకున్నాను. ఎందుకంటే తొలిసారి చెస్ ఒలింపియాడ్‌కు భార‌త్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. ప్ర‌తిసారి జ‌ట్టుకు ఆడాను. సొంత‌గ‌డ్డ‌పై ఆడ‌కుంటే ఎలాగ‌ని అనిపించింది. ఇక పైగా టాప్ సీడ్‌గా ఉన్నాం. చెన్నైకి విమానంలో గంట ప్ర‌యాణ‌మే కాబ‌ట్టి ఇబ్బంది లేదు. విమానంలో అనుమ‌తి ల‌భించ‌కుంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల‌నుకున్నాను. చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంటూనే సాధన చేశాను. అన్ని గేమ్‌లు కాక‌పోయినా వివిధ ద‌శ‌ల్లో కొన్ని అయినా ఆడ‌గ‌లిగితే బాగుంటుంద‌ని అనుకుంటున్నా. మాన‌సికంగా ఆట‌కు సిద్ధంగా ఉన్నాను. చెస్ శారీర‌క క్రీడ కాదు. డాక్ట‌ర్ కూడా ఆడ‌వ‌చ్చ‌ని స‌ల‌హా ఇచ్చారు. గ‌తంలో 3, 4 నెల‌ల గ‌ర్భిణులు కొంద‌రూ ఆడి ఉండ‌వ‌చ్చు. ఎక్కువ నెల‌ల‌తో ఆడుతు్న క్రీడాకారినిని నేనే అని అనుకుంటున్న‌ట్టు చెప్పారు.

Advertisement

Advertisement


ఇప్పుడు ఆడ‌బోయే ఫార్మాట్ కూడా చాలా భిన్నంగా ఉంది. ఆన్‌లైన్ లో జూనియ‌ర్‌, పురుషులు, మ‌హిళ‌లు క‌లిపి ఒకే జ‌ట్టుగా ఆడాం. 2020లో స్వ‌ర్ణం, 2021లో కాంస్య ప‌త‌కాలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తిలో ఆడ‌నున్నాం. పురుషులు, మ‌హిళ‌ల‌కు విడివిడిగా పోటీల‌ను నిర్వ‌హిస్తారు. 5గురు క్రీడాకారిణుల్లో న‌లుగురు గేమ్ ఆడుతారు. ఒక‌రు రిజ‌ర్వ్‌గా ఉంటారు. టాప్ సీడ్ లో బ‌రిలో ఉన్నా పోటీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ముక్యంగా ఉక్రెయిన్, జార్జియా, క‌జ‌కిస్తాన్, పోలేండ్ దేశాల నుంచి ఎక్కువ‌గా పోటీ ఉండ‌వ‌చ్చు. భార‌త పురుషుల జ‌ట్టు రెండ‌వ సీడ్ గా బ‌రిలో ఉంది. పురుషులు, మ‌హిళ‌ల‌కు ప‌త‌కాలు సాధించే అవ‌కాశాలు స‌మానంగా ఉన్నాయి.


ఇక చెస్ ఒలింపియాడ్‌లో ఒక దేశం నుంచి రెండు జ‌ట్లు (పురుషులు, మ‌హిళ‌లు) మాత్ర‌మే పాల్గొనాలి. ఆతిథ్య దేశానికి మ‌రో జ‌ట్టును బ‌రిలోకి దింపే వెసులుబాటు ఉంది. ఏ, బీ జ‌ట్ల‌ను ఎంపిక చేశారు. ఇక టాప్-5లో ఉన్న క్రీడాకారులు ఏ-జ‌ట్టులో 5 నుంచి 10 స్థానాల్లో క్రీడాకారులు బీ జ‌ట్టులో ఉంటారు. దేశాల సంఖ్య బేసి నెంబ‌ర్‌లో ఉండ‌డం చేత సీ-జ‌ట్ల‌ను కూడా ఎంపిక చేశారు. భార‌త్ నుంచి 30 మంది క్రీడాకారులు బ‌రిలో ఉన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో భార‌త్ త‌రుపున ఇంత మంది క్రీడాకారులు ఆడుతుండ‌డం ఇదే ప్ర‌థ‌మం.

Also Read : 

స‌చివాల‌య ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఈ నెల నుంచే పెరిగిన వేత‌నాలు

మళ్ళీ బ్యాట్ పట్టనున్న మిథాలీ… రిటైర్మెంట్ బ్యాక్…?

Visitors Are Also Reading