ఢిల్లీ క్యాపిటల్స్ తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ బ్యాటింగ్ తో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ను ఈ తరుణంలోనే హైదరాబాద్ బ్రాంచ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సారధి డేవిడ్ వార్నర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. డిసి విజయం సాధించగానే వార్నర్ గాల్లోకి ఎగురుతూ గంతులు వేశాడు.
READ ALSO : Agent Review : ఏజెంట్ రివ్యూ… అఖిల్ మూవీకి ఊహించని షాక్…!
Advertisement
ఇది ఇలా ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ ఒకరు తప్ప తాగి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం. సన్రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో నెగ్గిన తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన పార్టీలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఆ పార్టీలో ఒక స్టార్ డీసీ ప్లేయర్ అక్కడికి వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని జట్టు వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వార్తలు వస్తున్నాయి.
Advertisement
READ ALSO : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?
ఈ ఘటన తర్వాత ఆప్రమత్తమైన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కొన్ని కఠిన నిబంధనలు పెట్టినట్లు సమాచారం. ఫ్రాంచైజీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ఈ రూల్స్ ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత బయట వ్యక్తులు ఎవరు కూడా ప్లేయర్ల గదుల్లోకి వెళ్లడానికి వీల్లేదని ఫ్రాంచైజీ స్పష్టం చేసిందట. అయితే ఈ రూల్స్ ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, తప్పును బట్టి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. తప్ప పెద్దదైతే కాంట్రాక్టును కూడా రద్దు చేస్తారని నేషనల్ మీడియా సమాచారం.
READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!