Home » Agent Review : ఏజెంట్ రివ్యూ… అఖిల్ మూవీకి ఊహించని షాక్…!

Agent Review : ఏజెంట్ రివ్యూ… అఖిల్ మూవీకి ఊహించని షాక్…!

by Bunty
Ad

Agent Review in Telugu అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్. గతంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు పూర్తి యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా ఏజెంట్ సినిమాలో నటించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కీలకమైన పాత్రలో నటించారు. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.

Read Also : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?

Advertisement

Agent Review in Telugu

Agent Review in Telugu

కథ మరియు వివరణ:

ఇక ఏజెంట్ సినిమా కథ వివరాల్లోకి వెళితే… ఇది ఒక యాక్షన్ సినిమా. రా ఏజెన్సీ ప్రధానంగా సాగే.. ఈ సినిమాలో ఆఫీసర్ మమ్ముట్టి ఒక మాఫిమా ముఠా అని….సినిమా ప్రారంభంలో చెబుతారు. ఇక అతన్ని పట్టుకోవడంలో డిపార్ట్ మెంట్ విఫలం అవుతుంది. ఈ తరుణంలోనే అతని ముఠాను… పట్టుకోవడానికి కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్ అయితే బెటర్ అని భావిస్తారు. అలాంటి వాడే ఇలాంటి క్రిమినల్స్ ను పట్టుకోగలడని… హీరో అఖిల్ కు ఆపరేషన్ ఏజెంట్ ను అప్పగిస్తారు. దీంతో అఖిల్ తన అల్లరితో వారిని ఎలా పట్టుకుంటాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఇక ఇందులో హీరో అఖిల్ కు… హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది… వారి మధ్య ప్రేమ ఎలా చిగురుస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Read Also : మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : CM KCR

Agent Movie Review, Rating , Public Talk

యాక్షన్‌ సన్నివేశాలతో సాగే ఈ సినిమాను.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి… చాలా బాగా తెరకెక్కించారు. అటు హీరో అఖిల్ కూడా వన్ మాన్ షో గా ఈ సినిమాలో యాక్టింగ్ చేశాడు. అయితే… దర్శకుడు సురేందర్ రెడ్డి పడ్డ కష్టం ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ సినిమా చాలా బోరింగ్ గా ఉందని… అలాగే రొటీన్ స్టోరీ గా ఉందని… తేల్చేస్తున్నారు. హీరో అఖిల్ యాక్టింగ్ మినహా… సినిమా మొత్తం చెత్తగా ఉందని… ప్రేక్షకులు చెబుతున్నారు.

 

ప్లస్ పాయింట్స్:

అఖిల్ యాక్టింగ్
యాక్షన్‌ సీన్స్‌

నెగిటివ్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
లాజిక్ లెస్ స్టోరీ
సాంగ్స్
బిజిఎం

రేటింగ్-2/5

ట్యాగ్ లైన్ – ఆపరేషన్ ఏజెంట్… అట్టర్‌ ఫ్లాఫ్‌

READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!

Visitors Are Also Reading