Ad
ఐపీఎల్ లో గత ఏడాది వరకు సన్ రైజర్స్ జట్టుకు ఆడిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను.. ఈ ఏడాది మెగవేలంలోకి వదిలేసింది యాజమాన్యం. దాంతో అతడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2022 లో ఢిల్లీ తరపున ఆడుతున్న వార్నర్ బ్యాట్ తో రెచ్చిపోతున్నాడు. ఆసీస్ పాక్ పర్యటన కారణంగా మొదటి మూడు మ్యాచ్ లు మిస్ అయిన వార్నర్ ఇప్పుడు చెలరేగుతున్నాడు.
ఢిల్లీ సాధించిన విజయాలలో ఓపెనర్ గా బ్యాట్ తో చెలరేగుతున్న వార్నర్ నిన్న కేకేఆర్ పై కూడా అదే ప్రదర్శన కనబర్చాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఐపీఎల్ లో ఎవరికీ సాధ్యం కానీ ఓ రికార్డ్ ను తన పేరిట రాసుకున్నాడు. అదేంటంటే.. ఐపీఎల్ లో రెండు జట్లకు వ్యతిరేకంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.
అయితే నిన్న కేకేఆర్ పై 42 పరుగులు చేసిన వార్నర్.. మొత్తంగా ఆ జట్టుపై 1018 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ సీజన్ లోనే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ శతకం చేసిన వార్నర్ పంజాబ్ పై మొత్తంగా 1,005 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విధంగా ఒక్క జట్టుపైన 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు ఐపీఎల్ లో కొంతమంది ఉన్న రెండు జట్ల పై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా వార్నర్ రికార్డ్ నెలకొల్పాడు.
ఇవి కూడా చదవండి :
Advertisement