Home » పుష్ప2 గెటప్ లో డేవిడ్ వార్నర్..రూ.10,001 ఎవరికి పంపాడో తెలుసా..?

పుష్ప2 గెటప్ లో డేవిడ్ వార్నర్..రూ.10,001 ఎవరికి పంపాడో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీసి మంచి గుర్తింపు సాధించాడు. ఆయన సినిమాల్లో పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి మంచి గుర్తింపును అందుకుంది. దీంతో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక పుష్ప2 కూడా షూటింగ్ ప్రాసెస్ నడుస్తోంది. ఈ తరుణంలో పుష్ప2 మంచి ఒక లేటెస్ట్ ఫోటో బయటకు వచ్చింది. ఇది చాలా వైరల్ అయింది. ఈ తరుణంలో స్టార్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ కు ఫ్యాన్.

also read:ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు మూవీ..!

Advertisement

ఎప్పుడు అల్లు అర్జున్ డైలాగ్స్ కు రీల్స్ చేయడం, ఇతర వీడియోలు చేస్తుండడం, డాన్సులు చేయడం , చేస్తూ ఉంటాడు. వార్నర్ కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ ని అభిమానిస్తారు. ఈ సందర్భంలోనే అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు డేవిడ్ మరియు తన కూతురు ఇస్లా రోజ్ బన్నీకి బర్త్డే విషెస్ చెబుతూ ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. పుష్ప2 లో అల్లు అర్జున్ కాళీమాత గెటప్ లో కనిపించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.

also read:కాలికి నల్ల దారం కట్టేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరి పాటించాలి..లేదంటే నష్టమే..?

ఇక అల్లు అర్జున్ గెటప్స్ ని ఫేస్ యాప్ ద్వారా ఎడిట్ చేసి తన ఫేస్ తో ఉన్న పిక్స్ పోస్ట్ చేసి ఈ చిత్రాన్ని ఎడిట్ చేసి పెట్టారు డేవిడ్. అయితే ఈ పోస్టుతో పాటు మరో పిక్ ని కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్ యూపీఐ లావాదేవీ కి సంబంధించిన పిక్. డేవిడ్ వార్నర్ ఎవరికో రూ.10,001 పంపించినట్లు దానిలో కనిపిస్తోంది. కానీ డేవిడ్ ఆ పేరును కనిపించకుండా కవర్ చేశారు. ఈ పోస్ట్ కి కామెంట్ ఇలా రాశారు. మొదటిసారిగా యూపిఐని ప్రయత్నించాను, నేను దీన్ని ఎవరికి పంపాను అనేది మీరు ఊహించలేరు అంటూ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ వార్నర్ ఎవరికి పంపించి ఉంటారని ఆలోచిస్తున్నారు. మరి అమౌంట్ ఎవరికి పంపారో మీరు చెప్పగలరా..?

also read:భార్యాభర్తలు ఆ ఒక్క కార్యం చేయకపోతే..5 అనర్ధాలు తప్పవు..!!

Visitors Are Also Reading