Home » దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2024 విజేతలు వీరే..!

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2024 విజేతలు వీరే..!

by Anji
Ad

సాధారణంగా సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 అట్టహాసంగా జరిగింది. మంగళవారం రాత్రి ముంబైలో నిర్వహించిన ఈ వేడుకకు పలువురు సినీతారలు విచ్చేసి సందడి చేశారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలై బాక్సాఫీస్ ఎదుట ఘన విజయం అందుకున్న యానిమల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ వంగ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. అట్లీ దర్శకుడిగా తెరకెక్కిన జవాన్ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. జవాన్ లో  హీరోగా నటించిన షారూఖ్ ఉత్తమ నటుడిగా, నయనతార ఉత్తమనటిగా నిలిచారు.

Advertisement

Advertisement

విజేతలు వీరే : 

ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్) : బాబీ డియోల్ (యానిమల్

క్రిటిక్స్ ఉత్తమ నటుడు : విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)

ఉత్తమ గీత రచయిత : జావెద్ అక్తర్  ( నిక్లే ది కబి హమ్ ఘర్ సే ధున్కీ)

ఉత్తమ సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ : వరుణ్ జైన్

ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : శిల్పా రావు

ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ : యేసుదాస్

ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ : మౌషుమీ ఛటర్జీ

Also Read : ప్రపంచంలో అత్యంత ఖరీదైన చొక్కా భారతీయుడిదే.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!

Visitors Are Also Reading