Home » వన్డే WC 2023లో చేసిన దానికి ఆపోజిట్‌గా చేసిన కమిన్స్‌..!

వన్డే WC 2023లో చేసిన దానికి ఆపోజిట్‌గా చేసిన కమిన్స్‌..!

by Sravya
Ad

ఐపీఎల్ 2024లో కేకేఆర్ తో జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే సన్రైజర్స్ నేరుగా ఫైనల్ కు వెళ్ళేది కానీ ఓడిపోవడంతో క్వాలిఫైయర్ టు ఆడాల్సి వస్తోంది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఇప్పటి దాకా సన్రైజర్స్ సూపర్ గా నడిపించిన కెప్టెన్ కమిన్స్ మీద క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం లో జరిగింది. ఇదే స్టేడియంలో గత ఏడది వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది.

Advertisement

Also read:

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియా జట్లు పోటీ పడ్డాయి. అప్పటిదాకా వరల్డ్ కప్ టోర్నీలో ఓటమి ఎరుగని టీం గా సంచలన విజయాలు సాధించింది. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అప్పుడు ఆసీస్ కెప్టెన్ గా కమిన్స్ ఉన్నారు ఇప్పుడు సన్రైజర్స్ కెప్టెన్ గా ఉన్నారు. ఫైనల్ కు కమిన్స్ టాస్ గెలిచారు. ఇప్పుడు కూడా అతను టాస్ గెలిచాడు. ఫైనల్ లో ముందు బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ చేయాలని రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇదే గ్రౌండ్ లో అంత పెద్ద మ్యాచ్ ఆడిన అనుభవం ఉన్న అతను ఇప్పుడు ఎందుకు బ్యాటింగ్ ఎంచుకున్నాడని అంతా షాక్ అయిపోతున్నారు.

Advertisement

Also read:

బ్యాటింగ్ పై కమిన్స్ కు నమ్మకం బాగా పెరిగి ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారింది. లేదంటే ఈ సీజన్ లో SRH చేంజ్ చేసే మ్యాచులు ఓడిపోవడం వలన ఇలా నిర్ణయం తీసుకున్నారా అనేది అర్థం కావట్లేదు. అలానే ట్రావిస్ హెడ్ క్యాచ్లను వదిలేయడం పై కూడా క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. SRH మరి క్వాలిఫైయర్ 2 లో అయినా నెగ్గుతుందా లేదా అనేది చూడాలి. అలానే ఈసారి టైటిల్ ఎవరు కొడతారు అని కూడా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading