Home » పవన్ ట్వీట్ కు తారక్ రిప్లై ఎందుకు ఇవ్వలేదంటే..?

పవన్ ట్వీట్ కు తారక్ రిప్లై ఎందుకు ఇవ్వలేదంటే..?

by Sravya
Ad

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు జూనియర్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. టాప్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా బర్త్డే విషెస్ చెప్పారు. అందరు హీరోలు పెట్టిన పోస్టులకి జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ పోస్ట్ కి మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఇతర హీరోల పోస్ట్లు సొంత సోషల్ మీడియా అకౌంట్ నుండి వస్తే పవన్ కళ్యాణ్ పోస్ట్ మాత్రం జనసేన అకౌంట్ నుండి వచ్చింది.

Advertisement

అందువలన ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై ఇవ్వలేదని కామెంట్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సొంత సోషల్ మీడియా ఖాతా నుండి స్పందించి ఉంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చే వారని అంతా అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాలిటిక్స్ కి పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ రాకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి ఏ కామెంట్స్ చేయట్లేదు.

Advertisement

Also read:

Also read:

తారక్ రాజకీయాల్లోకి రావాలంటే మరో పదేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మాస్ క్లాస్ యాక్షన్ ఇలా అన్ని జోనర్ల సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు ఇకపై వేగంగా సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారు. విశ్రాంతి లేకుండా తారక్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. దేవర సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఫాన్స్ అయితే భావిస్తున్నారు మరి ఎంతవరకు కలిసొస్తుందనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading