ఐపీఎల్ 2022 ను చెన్నై సూపర్ కింగ్స్ అనుకున్న విధంగా ప్రారంభించకపోయిన.. ప్రస్తుతం కొంత బాగానే ఆడుతుంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయిన కూడా ఆ జట్టు అభిమానులు సంతోషంగా లేరు. ఈ విషయం పై మిమ్స్ దారుణంగా వస్తున్నాయి.
Advertisement
అయితే ఈ ఐపీఎల్ సీజన్ ను రవీంద్ర జడేజా కెప్టెన్సీలో ప్రారంభించిన చెన్నై జట్టు మొదటి భాగంలో వరుసగా ఓడిపోతూ వచ్చింది. మొదటి 8 మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లు గెలిచిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంది. ఆ తర్వాత మళ్ళీ కెప్టెన్ గా ధోని వచ్చిన తర్వాత నాటిన మూడు మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించింది. కానీ ఇప్పుడు ఎన్ని మ్యాచ్ లు గెలిచిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు రాకపోవడంతో… మొదట ఓడి.. ఇప్పుడు గెలిస్తే ఏం లాభం అంటూ ఫ్యాన్స్ ఏడుస్తున్నారు.
Advertisement
ఇక ఇంకొందరైతే చెన్నై ప్లే ఆఫ్స్ నుండి తప్పుకొని… ఇప్పుడు పాపం ఢిల్లీని కూడా బయటికి తీసుకెళ్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ కు ఢిల్లీకి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం నాలుగు జట్లతో పోటీ ఉన్న.. వాటి కంటే ఢిల్లీకి నెట్ రన్ రేటు చాల మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ జట్టును చెన్నై 91 పరుగుల తేడాతో ఓడించడంతో మిగితా జట్లతో సమానంగా ఢిల్లీ నెట్ రన్ రేటు వచ్చింది. దాంతో మ్యాచ్ లు అన్ని అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు చూద్దాం అంటూ చెన్నై.. ఢిల్లీని తీసుకెళ్తుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
దండం పెట్టించుకునే స్టేజ్ నుండి పెట్టె స్టేజ్ కు పడిపోయిన కోహ్లీ..!
ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?