Home » దండం పెట్టించుకునే స్టేజ్ నుండి పెట్టె స్టేజ్ కు పడిపోయిన కోహ్లీ..!

దండం పెట్టించుకునే స్టేజ్ నుండి పెట్టె స్టేజ్ కు పడిపోయిన కోహ్లీ..!

by Azhar
Ad
విరాట్ కోహ్లీ.. అంటే రన్ మిషన్. తన బ్యాట్ నుండి పరుగుల వరద పారించేవాడు కోహ్లీ. వన్డేల్లో అలవోకగా సెంచరీలు, టెస్టులో డబుల్ సెంచరీలు చేసేవాడు. ఈ క్రమంలోనే సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు అనుకున్నారు అంత..! అప్పుడు కోహ్లీ చేసే బ్యాటింగ్ విధ్వంసానికి అభిమానులు ఆటగాళ్లు అందరూ వంగి వండి దండాలు పెట్టేవారు.
అప్పుడు దండాలు పెట్టించుకునే కోహ్లీ.. ఇప్పుడు దండాలు పెట్టె స్టేజ్ కు వచ్చేసాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2022 లో కోహ్లీకి ఏమాత్రం కలిసి రావడం లేదు. పరుగులు చేయడనికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ గెలిచిన.. కోహ్లీ మాత్రం బ్యాటింగ్ లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్ ను నిలబెట్టిన.. చివర్లో సీన్స్ కార్తీక్ విధ్వంసం చేసాడు.
ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చిన కార్తీక్.. 8 బంతుల్లో 4 సిక్సులు ఒక్క ఫోర్ తో 30 పరుగులు చేసాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్ లతో రెచ్చిపోయాడు. ఇక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెసింగ్ రూమ్ లోకి వస్తున్న కార్తీక్ కు కోహ్లీ.. అతను చేసిన బ్యాటింగ్ వంగి దండం పెడుతూ కనిపించాడు. దాంతో అభిమానులు దండం పెట్టించుకునే స్టేజ్ నుండి పెట్టె స్టేజ్ కు పడిపోయాడు అంటూ సెటైర్స్ పేల్చుతున్నారు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading