Home » క్రికెట్ బ్యాట్ లో ఇన్ని మార్పులు చోటుచేసుకున్నాయా..?

క్రికెట్ బ్యాట్ లో ఇన్ని మార్పులు చోటుచేసుకున్నాయా..?

by AJAY
Ad

అన్ని క్రీడ‌ల్లో క్రికెట్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. గ‌ల్లీ నుండి ఢిల్లీ దాకా క్రికెట్ అంటే తెలియ‌ని వారుండ‌రు. క్రికెట్ ఇంగ్లండ్ దేశ జాతీయ క్రీడ అయినప్ప‌టికీ ప్రపంచ‌స్థాయిలో ఎక్క‌వ ఫాలోయింగ్ ఉన్న ఆట‌గా నిలిచింది. భార‌త్ లోనూ క్రికెట్ అభిమానులే ఎక్కువ‌గా ఉంటారు. క్రికెట్ ఆడ‌టం అన్నా చూడ‌టం అన్నా మ‌న‌వాళ్ల‌కు ఎంతో ఇష్టం. వ‌ర‌ల్డ్ క‌ప్ నుండి ఐపీఎల్ వ‌ర‌కూ టీవీలో వ‌చ్చిందంటే చూడ‌కుండా ఒక్క మ్యాచ్ ను కూడా వ‌ద‌ల‌రు. ఇక క్రికెట్ ఆడాలంటే అన్ని గేమ్స్ కు ఉన్న‌ట్టుగానే కొన్ని రూల్స్ ఉంటాయి. క్రికెట్ ఆడాలంటే జ‌ట్టుకు ప‌ద‌కొండు మంది సభ్యులు ఉండాలి.

Advertisement

cricket bat evolution

cricket bat evolution

అంతే కాకుండా ఒక‌రు బ్యాటింగ్ చేస్తుంటే మ‌రో జ‌ట్టు బౌలింగ్ చేస్తూ ఉండాలి. ఎవ‌రు ఎక్కువ స్కోర్ చేస్తే చివ‌రికి వారే విజేత‌లుగా నిలుస్తారు. ఇదిలా ఉంటే క్రికెట్ ఆడేందుకు ఒక బాల్, బ్యాట్ మ‌రియు మూడు వికెట్లు ఇత‌ర ఆట‌వ‌స్తువులు అవ‌స‌రం అవుతాయి. ముఖ్యంగా బ్యాట్ మరియు బాల్ భాగుండాలి. ఇక బాల్ విష‌యానికి వ‌స్తే క్రికెట్ ఆడేందుకు గ్రేస్ బాల్ ను ఉప‌యోగిస్తుంటారు. బ్యాట్ ల విష‌యానికి వ‌స్తే ర‌క‌ర‌కాల బ్యాట్ ల‌ను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ బ్యాట్ ల‌కు ఓ చ‌రిత్ర కూడా ఉంది. మ‌నం ఇప్ప‌డు ఉప‌యోగిస్తున్న బ్యాట్లు ఒక‌ప్పుడు ఇదే మాదిరిగా ఉండేవి కావు.

Advertisement

వాటి ఆకారం పూర్తిగా వేరేలా ఉండేది. 16శ‌తాబ్దంలో క్రికెట్ బ్యాట్ ఎక్కువ‌గా ఒక‌వైపుకు వంగి ఉండేది. 18వ శ‌తాబ్దం వ‌చ్చేస‌రికి దాని ఆకారం మారిపోయి చూడ్డానికి అన్నం క‌లిపే గ‌రిట మాధిరిగా అయ్యింది. 19వ శ‌తాబ్దంలో ప్ర‌స్తుతం ఉన్న బ్యాట్ ఆకారం వ‌చ్చింది కానీ చాలా వెడ‌ల్పుగా ఉండేది. 20వ శ‌తాబ్దంలో బ్యాట్ ప్ర‌స్తుతం ఉన్న బ్యాట్ కంటే కాస్త వేరుగా ఉండేది కానీ దాదాపు సేమ్ గానే క‌నిపించేది. ఇక రాబోయే కాలంలో బ్యాట్ ఆకారంలో ఇంకా ఎలాంటి మార్పులు వ‌స్తాయో చూడాలి.

Visitors Are Also Reading