కొన్ని పెళ్లిళ్లు పెళ్లిళ్లు ఆచారాలు పక్కాగా అమలు చేస్తుంటారు. అలా అమలు చేసే తరుణంలో కొన్ని విచిత్రమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఇలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఓ వింత ఘటనే చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వధూవరులు మారిపోయి ఒకరిస్థానంలో మరొకరు కూర్చొవడం గమనార్హం.
Advertisement
ఉజ్జయిని జిల్లాలోని బద్‌నగర్ రోడ్డులో అస్లానా గ్రామంలో నివసించే రమేస్‌లాల్ రెలోట్‌కు ముగ్గురు కూతుర్లు. ఒక కుమారుడు కలరు. మే 05న ముగ్గురు కుమార్తెల పెళ్లి జరగగా.. అయితే వీరిలో రాహుల్ కోమల్, నికితాకు, బోలాతో గణేష్‌కు కరిస్మాతో పెళ్లిలు జరిపించాలని నిర్ణయించారు. ఈ తరుణంలో వివాహ సంప్రదాయాల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహించేందుకు మూడు జంటలు సిద్ధం అయ్యాయి.
Advertisement
అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా చీకటిగా మారింది. దీంతో గందరగోల పరిస్థితులు తలెత్తాయి. ఈ తరుణంలో వధూవరులు మారిపోయి ఒకరి స్థానంలో మరొకరు కూర్చున్నారు. నికితా అనే వధువు గణేష్‌తో కూర్చోగా.. కరిష్మా అనే వధువు భోలాతో కూర్చుంది. అదేవిధంగా కాసేపు పూజలు సైతం చేసారు. మరికొంత సమయం తరువాత కుటుంబ సభ్యులకు విషయం తెలియడం వల్ల ఇరు కుటుంబాలకు మధ్య వివాదం తలెత్తింది. రెండు కుటుంబాలు మాట్లాడుకుని మరుసటి రోజు అమ్మాయిలకు పెళ్లి చేసి వారి భర్తలతో కలిసి పంపించారు. ఇలా వింత ఘటన చోటు చేసుకోవడం విశేషం.
Also Read :
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
విజయ్ దేవరకొండతో క్లోజ్ పిక్ ను షేర్ చేసిన సమంత…కపుల్స్ అంటూ నెటిజన్ల వింత రియాక్షన్స్…!